Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

Advertiesment
nara brahmani

ఠాగూర్

, బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (11:49 IST)
చిన్నతనంలో తన తండ్రి, సినీ నటుడు బాలకృష్ణ మనస్తత్వాన్ని తాను, తన చెల్లి తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఆయన పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి చెప్పుకొచ్చారు. నందమూరి బాలకృష్ణం కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని తాజాగా ప్రకటించింది. దీన్ని పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, బాలకృష్ణ సోదరి నారా భువనేశ్వరి పెద్ద పార్టీని ఏర్పాటు చేశారు. ఇందులో బాలకృష్ణ ఇద్దరు కుమార్తెలు నారా బ్రహ్మణి, తేజశ్వినిలు తమతమ భర్తలతో హాజరయ్యారు. 
 
ఈ పార్టీలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొనగా, నందమూరి బాలకృష్ణ మీద ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాలు పంచుకోవాలని భువనేశ్వరి సూచించారు. ఈ క్రమంలో స్టేజీపైకి వచ్చిన నారా బ్రాహ్మణి మాట్లాడుతూ, చిన్నతనంలో తన తండ్రిని తాను, తన సోదరి తేజు (తేజస్వి) ఇద్దరం అపార్థం చేసుకున్నామని చెప్పింది.
 
ఆయన ఎప్పుడూ లోపల ఒకటి, బయట ఒకటి మాట్లాడరని, లోపల ఏది అనిపిస్తే అది బయటకు అనేస్తారని, అలా మాట్లాడిన సందర్భాల్లో కొన్ని సార్లు ఏంటి అలా అంటున్నాడు? అని ఆయనను తప్పుగా అర్థం చేసుకున్నామని చెప్పింది. అయితే ఎదిగిన తర్వాత అలా ఉండటం ఎంత అవసరమో అర్థమైందని, అలా ఉండటం ఎంత కష్టమో కూడా తమకు తర్వాత అర్థమైందని బ్రాహ్మణి అన్నారు. తండ్రి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..