ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

ఐవీఆర్
శనివారం, 30 నవంబరు 2024 (19:47 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖం పైన ఓ వ్యక్తి ద్రవం పోసాడు. శనివారం సాయంత్రం దక్షిణ ఢిల్లీలోని షేక్ సరాయ్ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి ద్రవం విసిరాడు. ఘటనా స్థలంలో ఉన్న భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ కైలాష్ ఎమ్మెల్యే, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌తో కలిసి కేజ్రీవాల్ ఇరుకైన సందులో ప్రజలకు అభివాదం చేస్తూ నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇద్దరు నేతలకు ఇరువైపులా పోలీసులు తాడు బిగించి జనాన్ని అదుపు చేశారు.
 
కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా ఆప్ నిర్వహించిన పాదయాత్ర మాల్వీయా నగర్ ప్రాంతంలో అనుమతి లేకుండా జరిగిందని ఒక ప్రకటనలో పోలీసులు తెలిపారు. ఐతే ప్రజల రద్దీని నియంత్రించేందుకు పోలీసులను మోహరింపజేసినప్పటికీ, ఖాన్‌పూర్ డిపోకు చెందిన బస్ మార్షల్ అశోక్ ఝా, కేజ్రీవాల్ అనుచరులకు అభివాదం చేస్తున్నప్పుడు అతనిపై ద్రవం పోసాడు. సమీపంలోని పోలీసులు ఝాను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎందుకిలా చేసాడన్నది తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments