Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రయితే కన్నకుమార్తెకు మత్తుమందు... నిద్రపోయాక అత్యాచారం....

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (17:01 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కుమార్తె పట్ల కామాంధుడుగా మారాడు. రోజూ ఆమెకు మత్తు మందు ఇచ్చి ఆమె నిద్రలోకి జారుకోగానే అత్యాచారం చేస్తున్నాడు. అతడు చేస్తున్న ఈ దారుణాన్ని ఆ బాలికే పసిగట్టి తండ్రిని కటకటాల వెనక్కి పంపింది. 
 
వివరాలను చూస్తే... ముంబయిలోని మిరా రోడ్‌లో నివాసం వుంటోంది ఆ కుటుంబం. తండ్రి తన మొదటి భార్యతో తలెత్తిన మనస్పర్థల కారణంగా విడాకులిచ్చాడు కానీ తామిద్దరికీ కలిగిన ఇద్దరు అమ్మాయిలను తనే పెంచి పెద్దచేశాడు. ఐతే మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు కనుక మరో యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు.
 
ఇక తన మొదటి భార్యకు పుట్టిన ఇద్దర అమ్మాయిలను కూడా రెండో భార్యతో పాటే వుండమన్నాడు. వారలానే వుంటున్నారు. ఈ క్రమంలో తన పెద్ద కుమార్తెపై కన్నేసి కామాంధుడిగా మారిపోయాడు. ఆమెకి అన్నంలో మత్తు మందు కలిపి ఇవ్వడం మొదలుపెట్టాడు. భోజనం చేయగానే పెద్ద కుమార్తె మత్తులోకి జారుకోగానే ఆమెపై అత్యాచారం చేసేవాడు. ఇలా గత కొన్నిరోజులుగా జరుగుతోంది. 
 
తెల్లారిన తర్వాత ఆ బాలిక తన శరీరంలో ఏవో మార్పులు వస్తున్నట్లు అనిపిస్తోంది కానీ వాటికి కారణం ఏమిటో అర్థంకాలేదు. దాంతో ఓ రోజు తండ్రి ఇస్తున్న అన్నాన్ని తింటున్నట్లు నటించి వెళ్లి తన బెడ్రూంలో పడుకుంది. కుమార్తె ఎప్పటిలాగే మత్తులోకి జారుకుందని భావించిన కామాంధుడు ఆమెపై అత్యాచారం చేయబోయాడు. వెంటనే ఆమె పెద్దగా కేకలు వేసింది. దాంతో విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఆ బాలిక తన స్నేహితురాలి సాయంతో స్వచ్చంద సంస్థ దృష్టికి తీసుకెళ్లింది. విషయం పోలీసులకు చేరవేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments