Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రచారంలో దురుసు ప్రవర్తన : నన్నే ప్రశ్నిస్తావా? కార్యకర్తను తోసేసిన బాలయ్య

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (16:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం మహా ఉధృతంగా సాగుతోంది. కొన్నిచోటు అపశృతులు చోటుచేసుకున్నాయి. మరికొన్న చోట్ల పోటీలో ఉన్న అభ్యర్థులు తమను నిలదీస్తున్న ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన కోపాన్ని చూపారు. 
 
ఇటివలే అనంతపురం జిల్లా హిందుపురంలో ఎన్నికల ప్రచారంలో మీడియా ప్రతినిధి పట్ల బాలయ్య దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. తాజాగా తమ సొంత టీడీపీ పార్టీ కార్యకర్తపైనే చిందులు తొక్కారు. తన ఎన్నిల ప్రచారంలో భాగంగా హిందూపురం సమీపంలోని సిరివరం గ్రామానికి బాలయ్య వెళ్లారు. 
 
అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రవికుమార్‌ తమ గ్రామ చెరువుకు నీరు విడుదల చేయాలని బాలయ్యను కోరారు. ఇక దీంతో నన్నే ప్రశ్నిస్తావా అని అనుకున్నాడో ఏమో ఆగ్రహానికి గురైన బాలయ్య ఆ కార్యకర్తని తోసేశారు. 
 
వెంటనే ఆ కార్యకర్తను బయటకు పంపండి అని ఆదేశించడంతో పోలీసులు అక్కడి నుండి పంపేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రవికుమార్‌ టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వెంటనే సమీప గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ అభ్యర్థి ఇక్బాల్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాలయ్య తీరును ఆయన ఎండగట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments