బ్యాంకు క్లర్క్‌కు జాక్‌పాట్ : లాటరీ టిక్కెట్ కొన్న గంటకే రూ.కోటి

Webdunia
సోమవారం, 17 జులై 2023 (16:35 IST)
చాలా మంది ఏమాత్రం కష్టపడకుండానే డబ్బులు సంపాదించాలన్న ఆశ ఉంటుంది. ఇలాంటి వారు తమ చేతిలో డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటారు. అలా ఓ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసిన ఓ వ్యక్తి ఓ గంటలోనే కోటీశ్వరుడయ్యాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
పంజాప్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లాకు చెందిన రూపీందర్ జిత్ సింగ్ ఓ గ్రామీణ వ్యవసాయ బ్యాంకులో క్లర్క్‌గా పని చేస్తున్నాడుు. ఈయన గత యేడాది కాలంగా లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. 
 
ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఎప్పటిలాగే రూపీందర్ జిత్ సింగ్‌ నాగాలాండ్ బంపర్ లాటరీ టిక్కెట్లు ఒక్కోటి రూ.6 చొప్పున 25 టిక్కెట్లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆయన ఎప్పటిలానే బ్యాంకుకు వెళ్లి తన విధుల్లో నిమగ్నమయ్యాడు. 
 
ఓ గంట తర్వాత ఆయనకు లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన ఏకంగా రూ.కోటి గెలుచుకున్నట్టు ఏజెంట్ చెప్పాడు. దీంతో, రూపీందర్ సంబరం అంబరాన్నంటింది. ఈ డబ్బును తన పిల్లలు, కుటుంబం భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments