Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టులో నవశకం : 9 మంది జడ్జిలు ఒకేసారి ప్రమాణం

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (11:12 IST)
సుప్రీంకోర్టులో చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు. 
 
మంగళవారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కొత్త జడ్జీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయడం చరిత్రలో ఇదే తొలిసారి. 
 
కరోనా నేపథ్యంలో ప్రమాణస్వీకార వేదికను మార్పు చేశారు. ఒకటో కోర్టు ప్రాంగణం నుంచి అదనపు భవనం ఆడిటోరియంలోకి వేదికను మార్చారు. జడ్జిల ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీజేఐ నిర్ణయించారు. జడ్జిల ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
సుప్రీం కోర్టు జడ్జిలుగా ప్ర‌మాణం చేసిన వారిలో జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బీవీ నాగరత్నం, జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రవికుమార్‌, జస్టిస్ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ సుందరేష్, జస్టిస్‌ ఏఎస్‌ ఒకా, జస్టిస్‌ విక్రమ్‌నాథ్ ఉన్నారు. వీరి నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. 
 
సుప్రీంకోర్టుకు కొత్త జడ్జిగా నియమితులైన జస్టిస్‌ హిమా కోహ్లీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. ఇటీవల సుప్రీంకోర్టుకు కొత్తగా తొమ్మిది మంది న్యాయమూర్తులను నియమిస్తూ.. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం గెజిట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments