Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆఫ్గనిస్తాన్‌లోని మహిళలు ఉన్నత విద్యను కొనసాగించవచ్చు..

ఆఫ్గనిస్తాన్‌లోని మహిళలు ఉన్నత విద్యను కొనసాగించవచ్చు..
, సోమవారం, 30 ఆగస్టు 2021 (11:34 IST)
పాశ్చాత్య దేశాల మద్దతుతో నడిచే ప్రభుత్వాన్ని ఆగస్టులో వశం చేసుకున్న తాలిబన్లు... గతం కంటే భిన్నంగా పాలన సాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. 1990కు ముందు తాలిబన్ల పాలనలో బాలికలు, మహిళలకు విద్య నిషేధం కాగా, ఇప్పుడు కొన్ని నిబంధనలతో అవకాశమిస్తామని చెబుతోంది. 
 
ఆఫ్గనిస్తాన్‌లోని మహిళలు షరియా చట్టం నిబంధనలకు లోబడి... కో-ఎడ్యుకేషన్‌ కాకుండా ఉన్నత విద్యను కొనసాగించవచ్చునని మంత్రి అబ్దుల్‌ బాక్వి హక్కానీ అన్నారు. 
 
ఆఫ్గనిస్తాన్‌ తమ నిబంధనలకు అనుగుణంగా యూనివర్శిటీలో మహిళలు చదువుకునేందుకు అనుమతిస్తామని తాలిబన్‌ తాత్కాలిక ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆదివారం తెలిపారు. అయితే కో ఎడ్యుకేషన్‌పై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు.  
 
తమ ఇస్లామిక్‌, జాతీయ, చారిత్రాత్మక విలువలకు అనుగుణంగా సహేతుకమైన, ఇస్లామిక్‌ పాఠ్యాంశాలను రూపొందించాలని, అదేవిధంగా ఇతర దేశాలతో పోటీ పడే విధంగా చదువులు ఉండాలని తాలిబన్లు భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. 
 
ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో సైతం బాలికలు, బాలురను విడివిడిగా విద్యను అభ్యసిస్తారని చెప్పారు. మహిళా హక్కుల్లో వచ్చిన పురోగతిని గౌరవిస్తామని చెప్పినప్పటికీ... ఇస్లామిక్‌ చట్టం ప్రకారమే విద్యా వ్యవస్థను నడిపిస్తోంది. 
 
దీని బట్టి చూస్తే మహిళలు పని చేయగలుగుతారో లేదో అని ఊహించడానికి కన్నా ముందు అన్ని స్థాయిల్లో విద్యను పొందగలరా, పురుషులతో కలవగలరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంతా అక్కినేని మింత్ర భారీ బ్రాండ్ అభియాన్‌: ఫ్యాషన్ కోషియెంట్ వృద్ధి