తాతయ్య కోసం.. స్ట్రెచర్‌ను నెట్టుకెళ్లిన ఆరేళ్ల బాలుడు.. వీడియో వైరల్

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (20:08 IST)
Grand son
కరోనా వేళ.. కొన్ని ఆస్పత్రుల్లో కొన్ని దారుణ ఘటనలు చోటుచేసుకుంటూనే వున్నాయి. లంచం కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్లను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారున్నారు. తాజాగా స్ట్రెచర్ కోసం లంచం అడిగిన ఓ వార్డు బాయ్‌కి డబ్బివ్వలేని ఓ నిరుపేద కుటుంబంలోని ఆరేళ్ల బాలుడే స్వయంగా స్ట్రెచర్‌ను తోసుకుంటూ వెళ్లిన వైనం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్, డియోరియా జిల్లా ఆస్ప‌త్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. డియోరియా జిల్లాలోని గౌర గ్రామానికి చెందిన చెడి యాద‌వ్ రెండు రోజుల క్రితం జిల్లా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చేరారు. ఆయన కాలు ఫ్యాక్చ‌ర్ కావ‌డంతో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్ర‌మంలో సర్జికల్‌ వార్డులో ఉన్న యాద‌వ్‌ను డ్రెస్సింగ్‌ కోసం వేరే వార్డుకు తరలించాల్సి వచ్చింది. అయితే  స్ట్రెచర్‌పై తీసుకెళ్లేందుకు అక్క‌డున్న వార్డ్ బాయ్ 30 రూపాయలు లంచం డిమాండ్‌ చేశాడు. 
 
దీంతో యాదవ్‌కు సాయంగా వచ్చిన ఆయన కుమార్తె బిందు వ‌ద్ద డ‌బ్బులు లేక‌పోవ‌డంతో వాళ్లే స్ట్రెచర్‌పై తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. అయితే తల్లి కష్టం చూసి ఆ పసివాడి మనసు చలించిందో ఏమోకానీ, అక్కడే ఉన్న బిందు ఆరేళ్ల కుమారుడు శివం కూడా తన వంతుగా ముందుకొచ్చాడు. 
 
బిందు ముందుండి స్ట్రెచ‌ర్‌ను లాగితే.. శివం వెనుక తోస్తూ సాయం చేశాడు. ఈ దృశ్యాల‌ను ఎవరో వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments