Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుష్ప సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడా..?

పుష్ప సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడా..?
, మంగళవారం, 14 జులై 2020 (22:12 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇందులో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. బన్నీ ఇప్పటి వరకు చేయని ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంతో సాగే ఈ కథ పై సుకుమార్, బన్నీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అందుకనే ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు.
 
ఈ భారీ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. విజయ్ సేతుపతి క్యారెక్టర్ నచ్చకపోతే అసలు ఒప్పుకోడు. అలాంటిది ఈ సినిమాలో విజయ్ నటిస్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి ఈ పాత్ర గురించి మరింత ఆసక్తి ఏర్పడింది. ఇదిలా ఉంటే... ఈ సినిమా నుంచి విజయ్ తప్పుకున్నాడని తెలిసింది. దీంతో విజయ్ తప్పుకోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
 
ఇంతకీ మేటర్ ఏంటంటే... విజయ్ రెమ్యూనరేష్‌ ఇవ్వలేకే విజయ్‌ని తప్పించి ఆ స్థానంలో బాబి సింహాను తీసుకున్నారని కొంతమంది అంటుంటే... కాదు కాదు ఈ సినిమాని తమిళ్‌లో రిలీజ్ చేయనున్నారు కాబట్టి... అక్కడ రిలీజ్ చేస్తే తన ఇమేజ్‌కి నెగిటీవ్ అవుతుందనే ఉద్దేశ్యంతో విజయ్‌నే తప్పుకున్నాడని అన్నారు.
 
అయితే... ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే... డేట్స్ ప్రాబ్లమ్ వలనే ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాలో క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. సుకుమార్ గారి డైరెక్షన్లో ఫ్యూచర్లో ఖచ్చితంగా నటిస్తానని చెప్పారు విజయ్ సేతుపతి. అదీ.. సంగతి..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త సినిమాలను ఒప్పుకోని 'దేవసేన', పెళ్లి చేసుకుంటుందా?