Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (07:33 IST)
నేపాల్‌ను భారీ భూకంపం వణికించింది. ఇది భూకంప లేఖినిపై 6.3గా నమోదైంది. ఈ భూప్రకంపనలు భారతదేశ రాజధాని ఢిల్లీలో కూడా కనిపించాయి. అర్థరాత్రి 1.57 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేపాల్ జాతీయ భూకంప కేంద్రం (సిస్మోలజీ సెంటర్) తెలిపింది. కేవలం రెండు గంటల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ భూకంపం కారణంగా ఓ ఇల్లు కూలి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఇంకా ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సివుంది. 
 
కాగా, ఇటీవలి కాలంలో నేపాల్‌లో తరచుగా వరుస భూకంపాలు వస్తున్నాయి. అక్టోబరు 19 ఖాట్మంటులో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే, జూలై 31వ తేదీన 6.0 తీవ్రతో భూకంపం వచ్చింది. గత 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి దాదాపు 9 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 22 వేల మంది గాయపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments