Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీం కోర్టులో కరోనా కలకలం.. 50శాతం సిబ్బందికి పాజిటివ్

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (10:52 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కరోనా కలకలం రేపింది. సుప్రీంకోర్టులోని 50 శాతం మంది సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఇక నుంచి కేసులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటి నుంచే నిర్వహించాలని న్యాయమూర్తులు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కోర్టురూమ్‌లతోపాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్నీ శానిటైజ్ చేస్తున్నారు. కోర్టులోని అన్ని బెంచీలు ఒక గంట ఆలస్యంగా విచారణలు మొదలుపెట్టనున్నాయి.
 
సుప్రీంకోర్టులో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు సోమవారం కరోనా పాజిటివ్ అని తేలింది. సుప్రీంకోర్టు జడ్జీల కార్యాలయాలు, కోర్టు రిజిస్ట్రీల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు కరోనా అని తాజాగా జరిపిన పరీక్షల్లో వెల్లడైంది. 
 
కరోనా కలకలంతో సుప్రీంకోర్టులో కేసులను జడ్జీలు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారిస్తున్నారు. సుప్రీంకోర్టులో పనిచేస్తున్న పలువురు కోర్టు ఉద్యోగులు కరోనా బారిన పడటంతో జడ్జీలు, న్యాయవాదులు, కక్షిదారులు ఆందోళన చెందుతున్నారు.
 
ఇండియాలో కరోనా రెండో దశ ఉద్ధృతంగా ఉంది. గత వారం రోజుల్లోనే కొత్తగా పది లక్షల కేసులు నమోదయ్యాయి. ఆదివారమే లక్షన్నరకు పైగా కేసులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల్లో ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియాలోనే నమోదవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments