Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఘోరం.. నాలుగు నెలల పసికందును ఎత్తుకెళ్లిన కోతులు

Webdunia
సోమవారం, 18 జులై 2022 (18:56 IST)
యూపీలో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి చేతుల్లో నుంచి అతని నాలుగు నెలల పసికందును కోతులు ఎత్తుకెళ్లాయి. భవనం నుంచి కింద పడేశాయి. ఈ దుర్ఘటనలో చిన్నారి అక్కడికక్కడే కన్నుమూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. బరేలీలోని డుంకా ప్రాంతంలో బాధిత కుటుంబం నివసిస్తోంది. శుక్రవారం సాయంత్రం వ్యక్తి తన బిడ్డను ఎత్తుకుని బిల్డింగ్‌ పైన నడుస్తున్నాడు. 
 
ఆ సమయంలో హఠాత్తుగా వచ్చిన ఓ కోతుల గుంపు అతనిపై దాడి చేసింది. అతన్ని తీవ్రంగా గాయపరిచి.. బిడ్డను ఎత్తుకెళ్లాయి.
 
సాయం కోసం అతను కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లంతా వచ్చారు. వాళ్ల మీదా కోతులు దాడికి పాల్పడ్డాయి. పలువురిని కరిచాయి. దీంతో కొందరు రాళ్లు, కర్రలు విసరడంతో గందరగోళంలో ఆ కోతులు బిడ్డను కిందకు విసిరేశాయి. మూడంతస్తుల బిల్డింగ్‌ కావడంతో బిడ్డ అక్కడికక్కడే మృతి చెందింది.
 
నామకరణం వేడుక కోసం ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే ఇది జరగడం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments