మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో నదిలోపడిన బస్సు.. ముగ్గురు మృతి

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (15:34 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి నదిలోపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. 
 
ఆదివారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, అలీరాజ్‌పూర్ జిల్లాలోని ఖాండ్వా బరోడా రహదారిపై కొంతమంది ప్రయాణికులతో వేగంగా వెళుతున్న బస్సు ఒకటి అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరో 28 మంది గాయపడ్డారు. 
 
గాయపడిన వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారిలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments