Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రద్దు!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రద్దు!
, ఆదివారం, 26 డిశెంబరు 2021 (14:48 IST)
మధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికలను రద్దుచేస్తూ ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఆ ప్రతిపాదనలను రాష్ట్ర గవర్నర్‌కు పంపించారు. దీనికి గవర్నర్ ఆమోదముద్ర వేస్తే ఆ తర్వాత ఎన్నికల రద్దుకు సంబంధించి ఎన్నికల సంఘానికి ప్రభుత్వం కోరనుంది. 
 
పంచాయతీ రాష్ట్ర సవరణ ఆర్డినెన్స్‌ను తమ ప్రభుత్వం ఉపసంరించుకున్నట్టు మంత్రివర్గ సమావేశం తర్వాత ఆ రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ సరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. అయితే, ఈ ఎన్నికల రద్దుకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాల్సివుండగా, అది సాధ్యపడలేదు. ఇపుడు ఈ ఆర్డినెన్స్‌ను తిరిగి తీసుకునిరావాలని ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదించనుంది. 
 
రాష్ట్రంలో కరోనాతో పాటు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు, వచ్చే యేడాది జరగాల్సిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా వాయిదా వేయాలని కోర్టు సూచన చేసింది. ఈ పరిస్థితుల్లో ఎంపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇపుడు జరుగనున్న పంచాయతీ ఎన్నికలు వాయిదాపడే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్‌లో నూడుల్స్ కంపెనీలో భారీ పేలుడు - ఆరుగురు మృత్యువాత!