Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పృథ్వీరాజ్ హీరోగా ఆరాధన చిత్రం

పృథ్వీరాజ్ హీరోగా ఆరాధన చిత్రం
, మంగళవారం, 14 డిశెంబరు 2021 (19:06 IST)
Prithviraj,
సినిమా రంగంపై ఎనలేని ఆరాధన కలిగిన ముగ్గురు యువ కిశోరాలు తమ ప్రతిభను "పరిచయం" చేసుకోవడానికి సమాయత్తమవుతున్నారు. ప్రేమలోని కొత్త కోణాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తూ తాము రూపొందిస్తున్న చిత్రానికి "ఆరాధన" అనే ఆహ్లాదకరమైన పేరు పెట్టుకున్నారు. ఆ ముగ్గురు ప్రతిభావంతుల పేర్లు... "రవికిరణ్" (నిర్మాత), "వశిష్ట పార్థసారధి" (దర్శకుడు), "పృథ్విరాజ్" (హీరో)!! "ఆర్.వి.జి.మూవీజ్"తో కలిసి "రెబెల్ నేషన్" నిర్మించనున్న ఈ విభిన్న ప్రేమకథాచిత్రం అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. 'వశిష్ట పార్థసారధి'ని దర్శకుడిగా, 'పృథ్విరాజ్'ని హీరోగా పరిచయం చేస్తూ.తాను నిర్మాతగా పరిచయమవుతూ "రవికిరణ్" నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్ తోపాటు ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) ఈ చిత్రానికి మరో నిర్మాత కావడం విశేషం.
 
హీరో పృథ్విరాజ్ మీడియా బ్యాక్ గ్రౌండ్ నుంచి ప్రొడ్యూసర్ రవికిరణ్ సాఫ్ట్వేర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తుండగా  దర్శకుడు వశిష్ట పార్థసారధి "మై ఫ్రెండ్ గాంధి" అనే షార్ట్ ఫిల్మ్ తో తన సత్తాను నిరూపించుకున్నారు.
 
చిత్రనిర్మాత-రెబెల్ నేషన్ అధినేత రవికిరణ్ మాట్లాడుతూ, "సినిమా చూసిన ప్రేక్షకులతోపాటు విమర్శకులు కూడా "హృద్యమైన ప్రేమకథ"గా అభివర్ణించేంత గొప్పగా "ఆరాధన" చిత్రాన్ని తెరకెక్కించేందుకు మా దర్శకుడు వశిష్ట పార్థసారధి కృషి చేస్తున్నాడు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, మెగాస్టార్ చిరంజీవి, రాజేష్ ఖన్నాల "ఆరాధనల" సరసన మా "ఆరాధన" సగర్వంగా నిలబడుతుందనే నమ్మకం మాకుంది" అన్నారు.
 అధికభాగం షూటింగ్ మధ్యప్రదేశ్ లోని అత్యద్భుత లొకేషన్స్ లో జరుపుకోనున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పాటలు: రెహమాన్, సంగీతం: హరి గౌర, ఛాయాగ్రహణం: వేణు కొత్తకోట, నిర్మాతలు: రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)-రవికిరణ్, రచన-దర్శకత్వం: వశిష్ట పార్థసారధి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి హీరో వెంకీ కుడుముల ద‌ర్శ‌కుడు దాన‌య్య నిర్మాత‌