Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌నాథ్‌కు షాకిచ్చిన రాజస్థాన్ ఖాకీలు.. సామూహిక సెలవుపై విధులకు డుమ్మా

కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు బీజేపీ పాలిత రాజస్థాన్ రాష్ట్ర పోలీసులు తేరుకోలేని షాకిచ్చారు. మంత్రిరాకను పురస్కరించుకుని సుమారు 250 మంది పోలీసులు సామూహిక సెలవుపై విధులకు డుమ్మా కొట్టారు. ఈ ఘటన

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (09:08 IST)
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు బీజేపీ పాలిత రాజస్థాన్ రాష్ట్ర పోలీసులు తేరుకోలేని షాకిచ్చారు. మంత్రిరాకను పురస్కరించుకుని సుమారు 250 మంది పోలీసులు సామూహిక సెలవుపై విధులకు డుమ్మా కొట్టారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో ఒక్కసారి కలకలం రేపింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జోధ్‌పూర్‌లో నిర్మించిన కేంద్ర నిఘా (ఇంటెలిజెన్స్ బ్యూరో) కార్యాలయాన్ని ప్రారంభించడానికి హోం మంత్రి రాజ్‌నాథ్ వచ్చారు. ఇదే అదునుగా భావించిన 250 మందికి పైగా పోలీసులు సామూహిక సెలవుపై వెళ్లారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. పోలీసుల వేతనం తగ్గించేందుకు ఉద్దేశించిన ఉత్తర్వులు త్వరలోనే అమల్లోకి వస్తాయన్న వదంతులతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో కానిస్టేబుళ్ల వేతనం రూ.24,000గా ఉంది. దీన్ని రూ.19,000కు తగ్గించబోతున్నారంటూ వాట్సాప్ మెసేజ్ ఒకటి హల్‌చల్ చేసింది. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుళ్లు సామూహిక సెలవుపై వెళ్లేలా చేసింది. ఇలా సెలవుపై వెళ్లిన వారిలో సాధారణ విధుల్లో ఉండే పోలీసులతో పాటు… గౌరవ వందనం సమర్పించే పోలీసుల కూడా పలువురు ఉండటంతో తీవ్ర కలకలం రేగింది. 
 
ఈ ఘటనపై జోథ్‌పూర్ పోలీసు కమిషనర్ అశోక్ రాథోడ్ తీవ్రంగా స్పందించారు. అవి ముందుగా మంజూరు చేసిన సెలవులు కావని, వారంతా విధులకు గైర్హాజరయ్యారని వెల్లడించారు. ఉద్దేశ్యపూర్వకంగా విధులకు దూరంగా ఉన్న పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 
 
మరోవైపు ఈ పుకార్లను ఖండించారు రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా… పోలీసు సిబ్బంది సహా ఏ ఉద్యోగి జీతంను తగ్గించటానికి ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వు జారీ చేయలేదని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments