Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దలు కుదర్చిన పెళ్లి ఇష్టం లేక.. ఆ యువతి ఏం చేసిందంటే?

పెద్దలు నిశ్చయించిన పెళ్ళి చేసుకునేందుకు ఇష్టం లేక ప్రేమించిన వ్యక్తినే పెళ్ళాడేందుకు సిద్ధమైన ఓ అమ్మాయి పక్కా ప్లాన్ చేసింది. ఆ ప్లానులో ఆ యువతే ఇరుక్కుపోయింది. వివరాల్లోకి వెళితే... ఈశాన్య ఢిల్లీ సీ

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (12:53 IST)
పెద్దలు నిశ్చయించిన పెళ్ళి చేసుకునేందుకు ఇష్టం లేక ప్రేమించిన వ్యక్తినే పెళ్ళాడేందుకు సిద్ధమైన ఓ అమ్మాయి పక్కా ప్లాన్ చేసింది. ఆ ప్లానులో ఆ యువతే ఇరుక్కుపోయింది. వివరాల్లోకి వెళితే... ఈశాన్య ఢిల్లీ సీలంపూర్‌కు చెందిన షబానాకు త్వరలోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. పెళ్లి కూడా కుదిర్చారు. పెళ్లి పనుల్లో కుటుంబమంతా నిమగ్నమై ఉన్న వేళ, ఆమె ఇంట్లో దొంగతనం జరిగిందని వధువు డ్రామా చేసింది.
 
ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు లోనికి చొరబడ్డారని వధువు చెప్పింది. అంతేగాకుండా, తనను బెదిరించారని, రూ.20 లక్షల నగదు, నగలు దోచుకుపోయారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసుల విచారణలో వధువుపై అనుమానంతో ఆమె ఫోన్ డేటాను చెక్ చేశారు. దొంగతనం జరిగిన సమయంలో ఆమె ఫోన్ నుంచి ఒకే నంబరుకు చాలా కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు. 
 
అది అనీష్ దనే వ్యక్తిదని, అనీష్, షబానా మధ్య ప్రేమాయణం నడుస్తోందని, పెద్దలకు తెలియకుండా వారు పెళ్లి కూడా చేసుకున్నారని తేలింది. తల్లిదండ్రుల ఒత్తిడితో పెళ్లికి సిద్ధమైన షబానా.. దొంగతనం చేశాడనే అపవాదును వరుడి కుటుంబంపై వేయాలనుకుంది. ఆపై తాను ప్రేమించిన వ్యక్తితోనే సంసారం చేయాలనుకుని ప్లాన్ చేసింది. అయితే సీన్ రివర్సై పోలీసులు మొత్తం కనిపెట్టేయడంతో అనీష్, షబానాలు అరెస్ట్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments