Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో ఘోరం.. లోయలో పడిన బస్సు - 21 మంది మృతి

ఠాగూర్
గురువారం, 30 మే 2024 (20:07 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. జమ్మూ - పూంఛ్ రహదారిపై బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. భారీ ప్రాణనష్టం సంభవించింది. 21 మంది మృతి చెందారని, 40 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.
 
'ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్‌ నుంచి ప్రయాణికులతో బయల్దేరిన బస్సు.. జమ్ములోని అఖ్నూర్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. జమ్ము-పూంఛ్ రహదారిపై అదుపుతప్పి లోయలో పడిపోయింది' అని వెల్లడించారు. 
 
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగతున్నాయని చెప్పారు. గాయపడిన వారిని అఖ్నూర్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్ర విచారం వ్యక్తంచేశారు. 'ఈ ఘటన తీవ్రంగా బాధించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను' అని సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments