Webdunia - Bharat's app for daily news and videos

Install App

సార్వత్రిక ఎన్నికల సమరం : ఏడో దశ ఎన్నికల ప్రచారం పరిసమాప్తం!!

ఠాగూర్
గురువారం, 30 మే 2024 (19:34 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, గురువారం ఏడో దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. జూన్ ఒకటో తేదీన 57 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. తుది దశ కావడంతో వివిధ రాజకీయ పార్టీల నేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. మొత్తం ఏడు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతంలో 57 లోక్‌సభ నియోజకవర్గాలు పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల్లో 486 లోక్‌సభ సీట్లకు పోలింగ్‌ ముగిసిన విషయం తెల్సిందే. 
 
ఈ ఏడో దశలో ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌లో 13 చొప్పున, పశ్చిమబెంగాల్‌లో తొమ్మిది, బిహార్‌లో ఎనిమిది, ఒడిశా ఆరు, హిమాచల్‌ ప్రదేశ్‌లో నాలుగు, జార్ఖండ్‌లో మూడు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ లోక్‌సభ స్థానానికి శనివారం పోలింగ్‌ నిర్వహించనున్నారు. వీటితోపాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకూ అదేరోజు ఓటింగ్‌ జరగనుంది. జూన్‌ 4 కౌంటింగ్‌ ఉంటుంది.
 
మునుపటి ఎన్నికలతో పోలిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి దాదాపు 200లకుపైగా బహిరంగ సభలు, రోడ్‌ షోలలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ నియోజకవర్గం వారణాసికి కూడా తుది దశలోనే పోలింగ్‌ జరగనుంది.
 
కాగా, తుది విడత పోలింగ్‌ శనివారంతో ముగియనుండడంతో అదే రోజు సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువడనున్నాయి. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి ప్రముఖ మీడియా/ ప్రైవేటు సంస్థలు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఈ అంచనాలను వెలువరించనున్నాయి. 
 
తుది ఫలితాలు జూన్‌ 4న వెలువడనున్నాయి. దేశంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మూడోసారి అధికారం చేపడుతుందా? అంచనాలను తలకిందులు చేస్తూ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? అనేది ఆ రోజు తేలుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments