Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎయిర్ టర్బులైన్స్ బారినపడిన మరో విమానం!!

Advertiesment
qatar airlines

ఠాగూర్

, సోమవారం, 27 మే 2024 (08:57 IST)
ఖతార్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన విమానం ఒకటి ఎయిర్ టర్బులైన్స్‌కు గురైంది. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. ఇటీవల లండన్ నుంచి సింగపూర్ వెళుతున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర కుదుపుల(ఎయిర్ టర్బులైన్స్)కు గురైన విషయం తెల్సిందే. ఈ కారణంగా 73 యేళ్ల బ్రిటీష్ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 30 మంది గాయపడ్డారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ఆ విమానాన్ని థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో అత్యతవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. 
 
తాజాగా మరో విమానం ఎయిర్ టర్బులైన్స్‌కు గురైంది. దోహా (ఖతార్) నుంచి డబ్లిన్ (ఐర్లాండ్)కు వెళుతున్న ఖతార్ ఎయిర్‌వేస్ విమానం మార్గమధ్యంలో తుర్కియే (టర్కీ) గగనతలంలో తీవ్రమైన కుదుపులకు లోనైంది. ఎయిర్ టర్బులైన్స్ సంభవించడంతో ఈ విమానం ఊగిపోయింది. దాంతో విమానంలో 12 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికే పరిస్థితి అదుపులోకి రావడంతో విమానం ముందుకు సాగి, డబ్లిన్‌లో సాఫీగా ల్యాండ్ అయింది. 
 
ప్లీజ్... మా దేశాన్ని ఆదుకోండి.. ప్రపంచ దేశాలకు మాల్దీవులు ప్రెసిడెంట్ విన్నపం!! 
 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మాల్దీవులకు చెందిన ఇద్దరు మంత్రులు చేసిన నోటిదూల వ్యాఖ్యలు ఇపుడు ఆ దేశాన్ని తీవ్రమైన కష్టాల్లోకి నెట్టేశాయి. భారత పర్యాటకులంతా మాల్దీవులకు వెళ్ళడం మానేశారు. దీంతో ఆ దేశ పర్యాటక రంగం బోసిపోయింది. విదేశీ మారకద్రవ్య రాబడి తగ్గిపోవడంతో ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఓ విన్నపం చేశారు. హిందూ మహాసముద్రం లోతట్టు ప్రదేశంలో ఉండే మాల్దీవులు అంతర్జాతీయ సాయానికి నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయని, వాటి నుంచి రక్షణ కల్పించుకునేందుకు తమకు అంతర్జాతీయ నిధులు సమకూర్చాలని ఆయన కోరారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 0.003 ఉద్గారాలు మాత్రమే మాల్దీవుల నుంచి వెలువడుతున్నాయని, కానీ పర్యావరణ సంక్షోభం, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నష్టపోతున్న దేశాల్లో మాల్దీవులు ప్రథమస్థానంలో ఉంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రముఖ బ్రిటన్ పత్రిక ది గార్డియన్ కథనాన్ని ప్రచురించింది. 
 
ధనిక దేశాలన్నీ మానవతా దృక్పథంతో సాయం చేసి మాల్దీవులు లాంటి దేశాలను ఆదుకోవాలని ఆయన అభ్యర్ధించారు. పర్యటకమే ప్రధాన వనరుగా మనుగడ కొనసాగిస్తున్న ద్వీప దేశాలు (ఎఐడీఎస్) ప్రతీ పదేళ్లకోసారి సమావేశమవుతుంటాయి. ఇక్కడ ఆయా దేశాల అభివృద్ధే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యల గురించి చర్చిస్తారు. తాజాగా మాల్దీవులు, అటిగ్వా, బార్బుడా సంయుక్త అధ్యక్షతన సోమవారం సదస్సు ప్రారంభంకానుంది. ఈనేపథ్యంలో ముయిజ్జు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 
 
నామమాత్రపు అభివృద్ధి సాధించిన దేశాల ఆదాయంతో పోలిస్తే.. అందులో కేవలం 14 శాతం ఆదాయం మాత్రమే ఎస్ఐడీఎస్ దేశాలకు వస్తోందని ముయిజ్జు వ్యాఖ్యానించారు. కానీ, ప్రపంచ ద్రవ్యనిధి లెక్కల ప్రకారం మాల్దీవుల తలసరి జీడీపీ చిలీ, మెక్సికో, మలేషియా, చైనా తలసరి జీడీపీ కంటే ఎక్కువగా ఉంది. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసేందుకు మాల్దీవులకు కనీసం 500 మిలియన్ డాలర్ల ధనం అవసరమవుతుందని ముయిజ్జు పేర్కొన్నారు. ధనిక దేశాలు సాయం చేయకపోతే ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవడం తలకు మించిన భారమవుతుందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మచిలీపట్నంలో వైకాపా నేతల అరాచకం : జనసేన నేత కారుకు నిప్పు!!