Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దారుణం.. కారు ముందు ఆడుకుంటున్న బాలుడికి ఏమైంది?

సెల్వి
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (17:34 IST)
ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో దారుణం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండున్నరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ భయానక ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా, ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. ముఖర్జీ నగర్‌లోని ఓ ఇంటి బయట ఆడుకుంటుండగా చిన్నారి కారు ఢీకొట్టిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. నిందితుడు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరణించిన పిల్లవాడిని ఆర్యన్‌గా గుర్తించారు. సంఘటన జరిగినప్పుడు అతను కారు ముందు ఆడుకుంటూ వుండటం వీడియోలో చూడవచ్చు. 
 
తన కారు ముందు ఆడుకుంటున్న చిన్నారిని కారు డ్రైవర్ గమనించకపోవడంతో ఆ బాలుడిపై కారు పోనిచ్చాడు డ్రైవర్. ఈ ఘటనలో బాలుడి తలకు తీవ్రగాయాలైనాయి. కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తుంది. అయితే, చిన్నారి తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరారు. దీంతో కారు డ్రైవర్ చిన్నారిని తల్లిదండ్రులతో పాటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. 
 
ఆస్పత్రికి చేరుకునేలోపే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆసుపత్రికి చేరుకునే సరికి చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో చిన్నారి మృతి చెందడంతో నిందితుడు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. 
 
నిందితుల వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ ప్రారంభించినట్లు కూడా వార్తలు వచ్చాయి. మృతుడి తండ్రి ముఖర్జీ నగర్‌లోని కారు డ్రైవర్‌ నివాసంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments