Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెద్దగా కాంట్రవర్సీ లేని ఎమోషనల్ డ్రామా యాత్ర 2 రివ్యూ

yatra 2 poster

డీవీ

, గురువారం, 8 ఫిబ్రవరి 2024 (15:21 IST)
yatra 2 poster
నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకీ నారాయణ్, సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్, ఆశ్రిత వేముగంటి నండూరి
 సాంకేతికత: సినిమాటోగ్రఫీ: మధీ, సంగీత దర్శకులు: సంతోష్ నారాయణన్, నిర్మాత: శివ మేక, దర్శకుడు : మహి వి రాఘవ్
 
యాత్ర 2 సినిమా అనగానే వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కథ అని తెలిసిందే. యాత్ర తీసిన దర్శకుడు మహి వి రాఘవ సీక్వెల్ గా తీశాడు. మమ్ముట్టి, వై.ఎస్. పాత్ర చేయగా, తమిళ నటుడు జీవా జగన్ గా నటించారు. యాత్రలోనే కథ చెప్పేశారు. సీక్వెల్ లో ఏం చూపిస్తారనేందుకు యాత్ర 2 సినిమా హాట్ టాపిక్ గా మారింది. ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ :
వైఎస్ రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) 2009 ఎన్నికల్లో తన కుమారుడు జగన్ (జీవా) ని కడప ఎంపీగా నిలబెడుతున్నాను అనడంతో ఈ కథ మొదలవుతుంది. ఆ తర్వాత సి.ఎం. అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి  హటాత్తుగా మరణించడం తెలిసిందే. ఆ తర్వాత తన తండ్రి చేపట్టిన పాద యాత్రను కొడుకు జగన్ కొనసాగిస్తాడు. నేనున్నాను అనే మాట ఎంత పాపులర్ అయిందో అలాగే తండ్రి మాటను నెరవేర్చే కొడుకుగా ఈ చిత్రం వుంటుంది. జగన్ పాద యాత్ర, ఆ తర్వాత సీబీఐ దాడులు, జగన్ అరెస్ట్ కావడం జరుగుతుంది. 
 
తదంతరం పరిణామాలవల్ల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు (మహేష్ మంజ్రేకర్) సీఎం అవ్వడం, మొదటిసారి జగన్ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష నేతగా ఉండటం వంటి సంఘటనలు జరుగుతాయి. జైలులో వున్న జగన్ ఏం చేశాడు? పాద యాత్ర కొనసాగించాడా? తర్వాత పరిణామాలు ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష
 
ఈ సినిమా చూస్తే అంతా తెలిసిన కథే అనిపిస్తుంది. కొంత కల్పితంతో ఎమోషన్స్ దర్శకుడు పండించే ప్రయత్నం చేశాడు. తండ్రి కొడుకు దగ్గరకు రాత్రి రావడం, ఏం నాన్న నిద్రపట్టడంలేదా? అని అడిగి, ప్రజలకు మనం వున్నామనే భరోసా వుండాలని నీతి బోధ చేయడం వంటివి చూపించాడు. వికలాంగులకు సాయం చేయడం అనే సన్నివేశాలు కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఈ సినిమాలో జగన్ పాత్రకు పెద్దగా డైలాగ్ లు వుండవు. సోదరి షర్మిల పాత్ర కనిపించదు. తల్లిపాత్ర జైలులో వుండగా చూపిస్తారు. ఇలా కొంత నిజం, కొంత కల్పితంతో తీసిన ఈ సినిమా ప్రధానంగా ఢిల్లీ హై కమాండ్ పై ఎక్కు పెట్టిన అస్త్రంగా వుంటుంది. వై.ఎస్.కు పదవి రాకుండా ఎంతమంది కుట్ర చేశారనేది తెలియజేశాడు.
 
ఇక చంద్రబాబు, ఎబిఎన్. టీవీ, టి.వి.5  పేర్లను కథను అనుకూలంగా మార్చేశారు. తండ్రి బాటలో నడవాలనే లక్ష్యం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు ?, చివరకు సొంతంగా పార్టీ పెట్టి, సమర్ధవంతంగా ఆ పార్టీని నడిపించి.. చివరకు అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు ? వంటి అంశాలు సినిమాలో బాగా ఆకట్టుకున్నాయి.
 
మమ్ముట్టి ని ముందు భాగంలో చూశాం కనుక ఆయన గురించి చెప్పాల్సిన పనిలేదు. జీవా పాత్ర జగన్ గా  సరిపోయాడు. ప్రధానంగా సోనియా పాత్రలో జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ సూటయింది. ముఖ్యంగా ఆయా ఒరిజినల్ పాత్రలను బాగా ఇమిటేట్ చేస్తూ నటులందరూ ఆకట్టుకున్నారు. మొత్తానికి దర్శకుడు చెప్పాలనుకున్నది అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యేలా చేశాడు. కామన్ మేన్ కు సాదాసీదాగా వుంటుంది.
 
ఈ సినిమా వ్యూహం లా కంట్రవర్సీని క్రియేట్ చేసి సొమ్ము చేసుకోవాలనుకోవడం అనే పద్ధతికి చాలా దూరంగా దర్శకుడు మహి కనిపించాడు. వాస్తవిక కథాంశం బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా స్లోగా సాగుతుంది.  ఎక్కడా సవాల్ ప్రతి సవాల్ డైలాగ్ లు లేకుండా సాదాగా రాజకీయ ముఖచిత్రం ఇలా వుంది అని చూపించాడు. కొంత కథ కల్పితంగా కనిపిస్తుంది. ఇంటర్వెల్ లో ఎమోషన్స్ పెంచి సెకండాఫ్ పై కొంత ఇంట్రెస్ట్ పెంచే ప్రయత్నం చేసినా అది అంత ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. ఇక క్లైమాక్స్‌ కూడా అందరూ ఊహించిన విధంగానే సాగింది.
 
మహి వి రాఘవ దర్శకుడిగా  టేకింగ్ బాగుంది. సంగీత దర్శకుడు అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో బాగుంది.  నిర్మాత శివ మేక పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. జరిగిన కథ కాబట్టి కొత్తగా క్రియేట్ చేయడానికి పెద్దగా ఏమీ లేకపోవడంతో రొటీన్ గా సాగే కొన్ని పొలిటికల్ సీన్స్ సినిమాకి మైనస్ అయ్యాయి. ఈ సినిమా వైసీపీ అభిమానులకు నచ్చుతుంది. రాష్ర రాజకీయాలకంటే కేంద్ర రాజకీయాల్లో చదరంగం ఆడే వారిపై ఎక్కుపెట్టిన అస్త్రంగా ఈ సినిమా వుంది. రాజు కంటే మెండివాడు గొప్పవాడు అన్న నానుడిని నిజం చేస్తూ సోనియాపై వై.యస్‌ జగన్‌ చేసిన యుద్ధాన్ని ఈ సినిమాలో చూపించారు దర్శకుడు మహి.వి.రాఘవ్‌. జగన్‌ను పొగడాలంటే వేరే పార్టీ వాళ్లను తిట్టి పోయక్కర్లేదు అనే చిన్న విషయాన్ని ఎంతో గౌరవంగా తనదైన స్టైల్లో గొప్పగా చూపాడు దర్శకుడు.
రేటింగ్ 3/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుచ్చిబాబు దర్శకత్వంలో చెర్రీ జోడీగా జాన్వీ కపూర్?