Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు

pakistan flag

సెల్వి

, గురువారం, 8 ఫిబ్రవరి 2024 (10:19 IST)
పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ రోజున ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. భద్రతా కారణాల రీత్యా మొబైల్ సేవలను కూడా నిలిపివేశారు. అదనంగా, పొరుగు దేశంలోని వివిధ ప్రాంతాలలో 650,000 మంది భద్రతా బలగాలను మోహరించారు. 
 
గురువారం నాడు, దాదాపు 13 కోట్ల మంది పాకిస్థానీయులు తమ దేశంలోని తదుపరి ప్రభుత్వానికి, అలాగే దేశంలోని నాలుగు ప్రావిన్సుల శాసనసభల కోసం ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 
 
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కటకటాల వెనుక ఉన్నందున ఈసారి ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుందని అంచనా. ఇక గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇది సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. 
 
ఓటింగ్ గంటలను పొడిగించే అధికారం అధికారులకు ఉంటుంది. ఓటింగ్ ముగిసిన కొద్దిసేపటికే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కొన్ని గంటల్లో ప్రాథమిక ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 
 
పాకిస్తానీ రాజకీయాలు ప్రధానంగా మూడు ప్రధాన పార్టీల ఆధిపత్యంలో కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N), పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP)ల మధ్య పోటీ జరుగుతోంది. 
మొత్తంగా నలభై నాలుగు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొంటున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలీవరీ చేసిన వైకాపా ఎమ్మెల్సీ .. దర్జాగా సీఎంవో చక్కర్లు!