Webdunia - Bharat's app for daily news and videos

Install App

రహస్యంగా ప్రియురాలి ఇంటికెళ్లిన ప్రియుడు.. పాక్‌లో అడుగుపెట్టి చిక్కుల్లో... ఎలా?

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (10:14 IST)
రాజస్థాన్‌కు చెందిన 19 యేళ్ళ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. తన ప్రియురాలిని కలుసుకునేందుకు ఆమె ఇంటికి రహస్యంగా వెళ్ళాడు. ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత యువతి తల్లిదండ్రులు వచ్చారు. వారి కంటకనపడకుండా ఉండేందుకు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా, ఇంటి వెనుకభాగం నుంచి పారిపోతూ పొరపాటున పాకిస్థాన్ భూభాగంలోకి అడుగుపెట్టాడు. అంతే.. పాక్ పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి, రాజస్థాన్ పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్ రాష్ట్రంలోని గెమ్రా రామ్మేఘ్‌వల్ (19) భారత్ - పాకిస్థాన్ సరిహద్దులోని కుంహారా కా టిబ్బా ప్రాంతంలో నివసిస్తున్నాడు. గతేడాది నవంబరులో ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అదేసమయంలో ఆమె తల్లిదండ్రులు రావడంతో అక్కడి నుంచి దౌడుతీశాడు. అలా పారిపోతూ పొరపాటున భారత సరిహద్దు దాటి పాకిస్థాన్‌లో అడుగుపెట్టాడు.
 
దీన్ని గమనించిన పాక్ సరిహద్దు భద్రతా బలగాలు... గెమ్రాను అరెస్టు చేసి, విచారణ అనంతరం రాజస్థాన్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన యువకుడి తల్లిదండ్రులు గెమ్రాను వీలైనంత త్వరగా భారత్‌కు రప్పించాలని కోరుతూ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి కలెక్టర్‌ను వేడుకున్నారు. 
 
ఈ కేసును పరిశీలిస్తున్న బీఎస్ఎఫ్ అధికారి ఒకరు మాట్లాడుతూ, పాకిస్థాన్ రేంజర్లతో చర్చలు జరుపుతున్నామన్నారు. యువకుడు సింధ్ పోలీసుల అధీనంలో ఉన్నాడని, చట్టపరమైన చర్యల అనంతరం అతడిని భారత్‌కు అప్పగిస్తారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: కుంటుతూ.. గెంతుకుంటూ చావా ట్రైలర్ ఈవెంట్‌కు రష్మిక మందన్న.. అవసరమా? (video)

నాగ్‌పూర్ పోలీసుల కోసం ఫతే ప్రత్యేక స్క్రీనింగ్‌కు హాజరైన సోనూ సూద్

తెలుగులో రాబోతున్న విశాల్ చిత్రం మదగజ రాజా

Monalisa: రామ్ చరణ్ మూవీలో వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే

చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 తెలుగులో గ్రాండ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

తర్వాతి కథనం
Show comments