Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫుడ్ డెలివరీ చేసినట్టుగా ఫోటో... డోర్ డ్యాష్ ఉద్యోగిని మోసం!

Advertiesment
Caught On Camera
, బుధవారం, 4 నవంబరు 2020 (09:32 IST)
ఇటీవలికాలంలో డోర్ డెలివరీ సర్వీసులు ఎక్కువ అయిపోయాయి. ముఖ్యంగా, అనేక మంది కడుపు నింపుచుకునేందుకు వివిధ రకాలైన ఫుడ్డింగ్ యాప్‌లలో తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ ఇస్తున్నాయి. వీటిని డెలివరీ చేయాల్సిన డెలివరీ బాయ్స్‌.. తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. 
 
ముఖ్యంగా, కస్టమర్లకు ఇవ్వాల్సిన ఆహార ప్యాకెట్లను జాగ్రత్తగా కట్ చేసి, ఫుడ్‌ను దొంగిలిస్తున్నారు. ఇంకొందరు అయితే, సగం ఆరగించి, సగం ఫుడ్‌ను డెలివరీ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు ఇటీవలికాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
కానీ, ఈ వీడియో ఇంకాస్త వెరైటీగా ఉంది. అందుకే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కరోనా మహమ్మారి కారణంగా, నో కాంటాక్ట్ డెలివరీకి కస్టమర్లు అధిక ప్రాధాన్యం ఇస్తుండంతో, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు ఆహారాన్ని తీసుకుని వచ్చి, డోర్ దగ్గర పెట్టి, బెల్ కొట్టి వెళ్లిపోతున్నారన్నారు. పైగా, తాము డెలివరీ ఇచ్చామని చెప్పడానికి సాక్ష్యంగా, వారు ఓ ఫోటో తీసుకుని వెంటనే తాము పనిచేస్తున్న సంస్థ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి వుంటుంది.
webdunia
 
ఈ నేపథ్యంలో ఓ టిక్ టాక్ యూజర్, తన ఇంటి ముందు అమర్చిన సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాన్ని తీసి, సోషల్ మీడియాలో పెట్టగా అదిప్పుడు వైరల్ అయింది. తాను ఆర్డర్ చేసిన ఫుడ్‌ను డెలివరీ చేసేందుకు వచ్చిన యువతి, ఆ ప్యాక్‌ను ఇంటి డోర్ ముందు పెట్టి, పిక్ పట్టుకుని, ఆపై దాన్ని తీసుకుని దర్జాగా వెళ్లిపోయింది. 
 
ఈ వీడియోకు ఇప్పటికే కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితరాల్లో సైతం ఇది వైరల్ అయింది. ఇక ఇందులో డెలివరీ ఎగ్జిక్యూటివ్ యూఎస్‌కు చెందిన 'డోర్ డాష్' ఉద్యోగినిగా గుర్తించారు. ఈ వీడియోను మీరూ చూడండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలంకలో తీరానికి కొట్టుకొస్తున్న తిమింగలాలు