Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దారుణం: 13 ఏళ్ల బాలికపై రేప్.. హత్య..

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (18:23 IST)
ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీ గుర్గా‌వ్‌లో అత్యాచారంతో పాటు హత్య చోటుచేసుకుంది. అది కూడా 13 ఏళ్ల బాలికపై. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో నరేలా ప్రాంతానికి చెందిన దళిత బాలిక (13)పొరుగునే ఉన్న గుర్గావ్‌లో అత్యాచారం, హత్యకు గురైంది. 
 
ఆమె పనిచేస్తున్న ఇంటి యజమాని బంధువే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తమ కుమార్తె దహనసంస్కారాలు వెంటనే పూర్తి చేయాలంటూ యజమాని బంధువు తమపై ఒత్తిడి తెస్తున్నారు అంటూ మృతురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదయ్యింది.
 
యజమానురాలి సోదరుడి భార్య ప్రసవించడంతో సాయం చేసేందుకు జూలై 17న గుర్గావ్‌కు 13 ఏళ్ల బాలికను పంపారు. అయితే తన కుమార్తె చనిపోయిందంటూ ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం మా యజమాని తనకు ఫోన్ చేసి చెప్పారని.. రాత్రి ఏడు గంటల సమయంలో మృతదేహాన్ని మా ఇంటికి తీసుకువచ్చారు. వెంటనే దహన సంస్కారాలు పూర్తి చేయాలంటూ ఒత్తిడి చేశారు" అని తండ్రి పోలీసులకు తెలిపారు. యజమానురాలి సోదరుడు ప్రవీణ్ వర్మ, ఇతరులు కలిసి తన కుమార్తెను చంపారని ఆయన ఆరోపించారు.
 
ఈ మేరకు స్పందించిన పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం చేయించారు. హత్యకు ముందు బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలడంతో గుర్గావ్‌లో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, ప్రవీణ్ ను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments