Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీలి చిత్రాలు చూస్తుండగా మూగ బాలిక వచ్చింది.. ఆ యువకుడు ఏం చేశాడంటే?

నీలి చిత్రాలు చూస్తుండగా మూగ బాలిక వచ్చింది.. ఆ యువకుడు ఏం చేశాడంటే?
, శనివారం, 6 మార్చి 2021 (09:15 IST)
టెక్నాలజీ కొంత మేలు చేసినా.. అది చేసే కీడు చాలా ఎక్కువ. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ లేనిదే బతికే వాడు లేడు. యువత స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా లేనిదే.. నిద్రలేవట్లేదు. ఆన్‌లైన్ గేమ్‌లకు.. ఇతరత్రా అలవాట్లకు బాగా అలవాటు పడి తమ జీవితాలను యువత పాడు చేసుకుంటోంది. 
 
తాజాగా ఓ 17 ఏళ్ల యువకుడు నీలిచిత్రాలను చూస్తూ, వాటి మత్తులో పడి ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం చేయబోయాడు. మాట్లాడలేని ఆమె అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆమె చున్నీతోనే ఉరిబిగించాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పొలంలో పారేశాడు. ఏమీ తెలియనట్టు అందరితో కలిసిపోయిన ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అలీగర్ జిల్లాలో కైవాల్ష్ అనే గ్రామంలో ఓ 17 ఏళ్ల యువకుడు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉపాధి కోసమే అతడు దౌరాయ్ గ్రామం నుంచి కైవాల్ష్‌కు వచ్చాడు. అయితే ఫిబ్రవరి 28వ తారీఖున మధ్యాహ్నం సమయంలో ఆ యువకుడు తన స్మార్ట్ ఫోన్లో నీలిచిత్రాలను చూస్తూ ఉన్నాడు. 
 
అదే సమయంలో అటుగా ఓ మూగ బాలిక వచ్చింది. ఆ బాలిక మాట్లాడలేదని అప్పటికే అతడికి తెలిసి ఉండటంతో, దాన్ని అనువుగా తీసుకున్నాడు. ఆమెకు మాయమాటలు చెప్పి పొలంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడి చేయబోయాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. ఆమె వద్ద ఉన్న చున్నీతో ఆ బాలికకు ఉరి బిగించి చంపేశాడు.
 
మృతదేహాన్ని దూరంగా తీసుకెళ్లి పొలాల్లోనే కనిపించకుండా పారేశాడు. అయితే ఆ బాలిక రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు భయపడిపోయారు. ఊరంతా వెతికినా కనిపించకపోవడంతో పొలాల్లో వెతికారు. చివరకు ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తానే నేరం చేశానని అతడు కూడా ఒప్పుకున్నాడు. 
 
పోలీసులు అతడి వద్ద ఉన్న మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడి మొబైల్ లో 118 నీలిచిత్రాలు ఉన్నాయనీ, వాటి ప్రభావం వల్లే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముకేశ్ అంబానీ కేసులో కీలక మలుపు.. SUV ఓనర్ మృతి