ఉయ్యాలలో నిద్రిస్తున్న ఓ చిన్నారి కిందపడి మృతిచెందింది. ఈ ఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో చోటుచేసుకుంది. ఎం జీవికా అనే రెండు నెలల చిన్నారిని ఆమె తల్లి చిన్న పిల్లలు ఉయ్యాలలో వేసింది. అందు మూడు అడుగుల ఎత్తులో ఉంది.
అయితే కొద్దిసేపటికే ఆ చిన్నారి.. ఉయ్యాల నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంది గమనించిన చిన్నారి తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో.. చిన్నారిని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు.
అయితే రాజాజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. చిన్నారి బుధవారం మరణించింది. ఈ ఘటనకు సంబంధించి చిన్నారి తండ్రి ముత్తు రామలింగం ఎలుమాలై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చిన్నారి తండ్రి ముత్తు రామలింగం కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
ముత్తు రామలింగం దంపతులకు ఈ చిన్నారి తొలి సంతానం అని చెప్పారు. ఆడ శిశువు కావడంతో హత్య జరిగిందనడానికి అవకాశాలు తక్కువగా ఉన్నట్టు భావిస్తున్నామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగిస్తామని పోలీసులు వెల్లడించారు.