కర్నాటకలోని అత్తిబెల్‌లో బాణాసంచా గోదాములో పేలుడు.. 11 మంది మృతి

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2023 (10:01 IST)
కర్నాటక రాష్ట్రంలోని అత్తిబెల్‌లో ఉన్న ఓ బాణాసంచా గోదాములో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 11 మంది మృత్యువాతపడ్డారు. శివకాశి నుంచి వచ్చిన బాణాసంచా లోడు దించుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఈ పేలుడు సంభవించింది. ఆ తర్వాత క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకున్న షాపు యజమానితో సహా మొత్తం 11 మంది సజీవదహమయ్యారు. శనివారం సాయంత్రం ఈ దారుణ ఘటన జరిగింది. 
 
బెంగుళూరు నగర శివారు ప్రాంతంలో తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఉన్న అనేకల్ తాలూకా అత్తిబెల్‌లో శనివారం ఈ దారుణం జరిగింది. అక్కడి నవీన్ గోదాముకు తమిళనాడుకు శివకాశి నుంచి బాణాసంచా లోడు వచ్చింది. లోడును వాహనం నుంచి దించుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నాలుగు దుకాణాలు, ఒక మినీ కంటైనర్, రెండు పికప్ వాహనాల దగ్ధమైపోయాయి. మంటలు క్షణాల్లో నలు దిక్కులకు వ్యాపించడంతో షాపు యజమానితో సహా మొత్తం 11 మంది మృత్యువాతపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments