Webdunia - Bharat's app for daily news and videos

Install App

11మంది యువకులు ఏడాదిగా యువతిపై అత్యాచారం, బిడ్డకు జన్మ.. ఆ తరువాత?

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (19:57 IST)
నిర్భయ చట్టాలు వచ్చినాసరే కామాంధులు ఏమాత్రం భయపడటం లేదు. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. కొంతమందిని బలవంతంగా లొంగదీసుకుంటే మరికొంతమందికి మాయమాటలు చెప్పి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
 
మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలోని వాసాయ్ గ్రామంలో 21 యేళ్ళ యువతిని మాయమాటలు చెప్పి ప్రేమించాడు ఒక యువకుడు. ఆమెను శారీరకంగా లొంగదీసుకుని ఇంటి నుంచి తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. నెల రోజుల పాటు ఇద్దరూ వేరే ప్రాంతంలో ఒకే గదిలో కలిసి ఉన్నారు. యువతి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారు కుమార్తెను వారం రోజుల పాటు వెతికి ఆ తరువాత పట్టించుకోలేదు. అయితే యువకుడు మాత్రం వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి పలుమార్లు యువతితో శారీరకంగా కలిశాడు. ఆ తరువాత ఆ యువతిని వదిలించుకోవాలనుకున్నాడు. 
 
తన స్నేహితులకు విషయం చెప్పి ఒక స్నేహితుడి ఇంటికి తీసుకెళ్ళాడు. అతని స్నేహితుడు కూడా ఆమెను భయపెట్టి అత్యాచారం చేశాడు. ఇలా అతని స్నేహితులు, వారి స్నేహితులు కలిసి మొత్తం 11 మంది యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. సంవత్సరన్నగా ఈ అఘాయిత్యం జరుగుతూనే ఉంది. అయితే ఆ యువతి గర్భం ధరించింది. అయినాసరే కామాంధులు ఆమెను వదిలిపెట్టలేదు. దీంతో భయాందోళనకు గురైన యువతి వారి చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments