Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 ఏళ్ల బుడతడు పాక్ జలసంధిని ఈదేశాడు... 32 కిలోమీటర్ల సముద్రాన్ని?

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (16:08 IST)
10 ఏళ్ల వయస్సు ఉన్న బుడతడు సముద్రంలో ఏకంగా 32 కిలోమీటర్ల దూరాన్ని ఈదేసి సరికొత్త రికార్డ్ సృష్టించాడు. 10 ఏళ్ల వయస్సులో చాలా మందికి నీళ్లంటే భయం ఉంటుంది. పైగా ఎంతో అనుభవం ఉంటే కానీ అలాంటి సాహసాలు సాధ్యం కాదు. ఈ చిచ్చరపిడుగు భారతదేశం మరియు శ్రీలంక దేశాల మధ్య ఉండే పాక్ జలసంధిలో శ్రీలంక నుంచి తమిళనాడులోని ధనుష్కోటికి.. ఏకంగా 32 కిలోమీటర్లు సముద్రాన్ని ఈదేసి సరికొత్త ఫీట్‌ అందుకున్నాడు. 
 
తమిళనాడు థేనీ జిల్లాకు చెందిన 10 సంవత్సరాల జశ్వంత్‌కు చిన్ననాటి నుంచి ఈత కొట్టడం అంటే ఇష్టం. అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు స్విమ్మింగ్‌లో శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత జశ్వంత్ స్విమ్మింగ్‌లో వండర్స్ క్రియేట్ చేసాడు. తాజాగా జశ్వంత్ పాక్ జలసంధిలో శ్రీలంకలోని తలైమనార్ నుంచి ధనుష్కోటికి 32 కిలోమీటర్ల దూరాన్ని పదిగంటల 30 నిమిషాల్లో రీచ్ అయ్యాడు.
 
శ్రీలంకలోని తలైమనార్ నుంచి ఉదయం 4 గంటలకు బయల్దేరి.. 9 గంటలకు అంతర్జాతీయ మారిటైమ్ బోర్డర్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి తమిళనాడులోని ధనుష్కోటికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకున్నాడు. ఈత కొట్టే సమయంలో హెల్త్ డ్రింక్స్‌..మంచినీళ్లు మాత్రమే తీసుకున్నాడు. ఈ క్రమంలో ధనుష్కోటికి చేరుకున్న జశ్వంత్‌కు తమిళనాడు డీజీపీ శైలేంద్ర, నౌకాదళ అధికారులు ఘనస్వాగతం పలికి అభినందించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments