తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్‌లో జానీ మాస్టర్ కూడా ఒకరు. రామ్ చరణ్, ఎన్టీఆర్, చిరంజీవి లాంటి అగ్ర హీరోలకు కూడా ఈయన కొరియోగ్రఫీ చేసారు. ఇప్పటివరకు వందల పాటలకు డాన్స్ స్టెప్స్ వేయించిన ఈయన ఇప్పుడు జైలుకు స్టెప్స్ వేస్తున్నాడు.
ఓ ఛీటింగ్ కేసులో ఈయన ఇరుక్కున్నాడు. ఇప్పుడు జైలుకు కూడా వెళ్లాడు జానీ. ఈయనతో పాటు మరో ఐదుగురిని కూడా జైలుకు తరలించాలని మేడ్చల్ కోర్ట్ ఆదేశించింది. ఈయనపై నాలుగేళ్ల కింద ఈ కేసులు నమోదయ్యాయి. 2015 సంవత్సరంలో సెక్షన్ 354, 324, 506 కింద జానీ మాస్టర్ పై కేసు నమోదు చేయగా.. ఇన్నాళ్లకు దీనిపై తీర్పు వచ్చింది.
సెక్షన్ 354 కేసుని కొట్టివేసి.. 324, 506 సెక్షన్స్ మాత్రం నిజమే అని నిర్థారించింది కోర్ట్. దాంతో ఈయనకు 6 నెలల శిక్ష విధించింది. జానీ మాస్టర్‌తో పాటు మరో 5 మంది కుడా జైలుకు వెళ్లారు. అయితే ఈయన చెక్ బౌన్స్ కేసుతో పాటు మరిన్ని కేసుల విషయంలో నిందితుడిగా తేలింది.
ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపర్చటం.. హత్యాయత్నం చేయడం వంటి చర్యలు ఈ సెక్షన్ల కిందకి వస్తాయి. కానీ ఇందులో 354 సెక్షన్ కింద కూడా కేసు నమోదు కావడం.. దాన్ని కోర్ట్ తప్పు అని నిర్ధారించడం జరిగింది. ఇక మిగిలిన 324, 506 సెక్షన్ల కింద నేరం రుజువు కావడంతో 6 నెలల జైలుశిక్ష విధించింది మేడ్చల్ కోర్టు.