Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో విషాదం... లోయలోపడిన కారు... పది మంది మృతి!!

వరుణ్
శుక్రవారం, 29 మార్చి 2024 (10:14 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఓ కారు ప్రమాదవశాత్తు లోయలోపడింది. దీంతో 10 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ అనే ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, సివిల్ క్విక్ రెస్పాన్స్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కారులో నుంచి పలు మృతదేహాలను వెలికి తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 
 
మార్చి 31వ తేదీ ఆదివారం కూడా పని చేయనున్న బ్యాంకులు.. ఎందుకో తెలుసా? 
 
మార్చి 31వ తేదీన ఆదివారం. ఆ రోజున కూడా అన్ని బ్యాంకులు పని చేస్తాయని భారత రిజర్వు బ్యాంకు వెల్లడించింది. సాధారణంగా మార్చి 31వ తేదీ ఆర్థిక సంవత్సరం ముగింపు చివరి రోజు. దీంతో ఆ రోజు బ్యాంకులు పని చేసినప్పటికీ సాధారణ లావాదేవీలు ఏవీ ఉండవు. అయితే, ఈ యేడాది మార్చి 31వ తేదీ ఆదివారం రావడంతో బ్యాంకులు సెలవు మూసివేసివుంటాయని ప్రతి ఒక్కరూ అనుకోవచ్చు. 
 
కానీ, ఈ మార్చి 31వ తేదీ ఆదివారం బ్యాంకులు పని చేస్తాయని ఆర్బీఐ ప్రకటించింది. అయితే, ఆ రోజున సాధారణ లావాదేవీలు ఏవీ జరగకపోవచ్చని పేర్కొంది. ప్రభుత్వ పరమైన అన్ని లావాదేవీలు జరపవచ్చనే దానిపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ పరమైన అన్ని రకాల లావాదేవీలు జరుగుతాయని పేర్కొంది. అలాగే, ఇతర ఖాతాదారులు ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చని తెలిపింది. 
 
ఆదివారం కింద సేవలు పొందవచ్చు.. మార్చి 31వ తేదీన నెఫ్ట్, ఆర్టీజీఎస్ విధానం ద్వారా అర్థరాత్రి 12 గంటల వరకు లావాదేవీలు జరపవచ్చు. ప్రభుత్వ ఖాతాదాలకు సంబంధించి ఏవైనా చెక్కులను క్లియరింగ్ కోసం బ్యాంకులు సమర్పించుకోవ్చని ఆర్బీఐ తెలిపింది. కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాల నుంచి పెన్షన్ చెల్లింపులు, ప్రత్యేక డిపాజిట్ పథకం, 1975, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం 1968, కిసాన్ వికాస్ పత్ర 2014, సుకన్య సమృద్ధి ఖాతా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 2004కు సంబంధించిన సేవలు మార్చి 31వ తేదీన పొందవచ్చని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments