సార్వత్రిక ఎన్నికలు : తుది ఫలితాలివే...

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (08:17 IST)
దేశ 17వ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయభేరీ మోగించింది. ఈ ఒక్క పార్టీనే ఏకంగా 301 సీట్లను కైవసం చేసుకుంటే.. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఏకంగా 350 సీట్లను కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ మరోమా చతికిలపడింది. ఈ పార్టీకి కేవలం 54 సీట్లు మాత్రమే రాగా, దాని మిత్రపక్షాలకు 38 సీట్లు వచ్చాయి. అంటే యూపీఏ కూటమి 92 సీట్లతో సరిపుచ్చుకోగా, ఇతరులు 100 స్థానాల్లో విజయం సాధించారు. 
 
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ సీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ పార్టీ ఏకంగా మొత్తం 175 సీట్లకు గాను 150 సీట్లను కైసవం చేసుకుంది. అధికార తెలుగుదేశం పార్టీ కేవలం 24 సీట్లతో సరిపుచ్చుకుంది. 
 
సినీ హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఒక్క సీటుతో ఖాతా తెరిచింది. ఇక్కడ విచిత్రమేమిటంటే. జనసేనాని చేసిన రెండు చోట్లా చిత్తుగా ఓడిపోగా, ఆ పార్టీకి చెందిన రాజోలు అభ్యర్థి విజయం సాధించారు. 
 
అలాగే, మొత్తం 25 లోక్‌సభ సీట్లలో వైకాపాకు 22 రాగా, టీడీపీకి మూడు సీట్లు వచ్చాయి. ఇక తెలంగాణాలోని 17 లోక్‌సభ సీట్లలో తెరాసకు 9, కాంగ్రెస్‌ పార్టీకి 3, బీజేపీకి నాలుగు, ఎంఐఎంకు ఒక్కసీటు వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments