Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#ElectionResults2019.. స్టాక్ మార్కెట్ జోరు.. నిఫ్టీ రికార్డు..

Advertiesment
Election Results 2019
, గురువారం, 23 మే 2019 (10:32 IST)
దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది.  గురువారం స్టాక్ మార్కెట్ సూచీలు దూసుకుపోతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ రికార్డు స్థాయిలో రాకెట్ వేగంలో ముందుకు పోతున్నాయి. 
 
కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ 300 స్థానాల్లో ఆధిక్యంతో ముందుకు దూసుకుపోతున్న వేళ.. సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 791 పాయింట్లతో రికార్డు సృష్టించింది. 791 పాయింట్లతో సెన్సెక్స్ 39,901 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 
 
అలాగే నిఫ్టీ కూడా 231 పాయింట్లతో 11,968 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంకింగ్ సెక్టార్ల షేర్లు లాభదాయకంగా ట్రేడ్ కావడంతో మొట్టమొదటి సారిగా నిఫ్టీ 31వేల మార్కును నమోదు చేసుకుంది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, లార్సెన్ అండ్ టర్బో, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ల్యాండ్ బ్యాంక్ వంటి సంస్థలు లాభాలను నమోదు చేసుకున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

AP Assembly 2019 Live results - YSRCP -137 / TDP-30