Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

AP Assembly 2019 Live results - YSRCP - 148 / TDP-20 గెలుపు

Advertiesment
AP Assembly 2019 Live results - YSRCP - 148 / TDP-20 గెలుపు
, గురువారం, 23 మే 2019 (21:51 IST)
#APAssemblyResults2019
Party Lead/Won
YSR Congress 148 గెలుపు, ఆధిక్యం 3
TDP 20 గెలుపు, 3 ఆధిక్యం
Congress 0
Janasena 1 గెలుపు
 
అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఎవరూ ఊహించని అనూహ్యమైన రీతిలో వైసీపీ విజయ ప్రభంజనం సాగుతోంది. వైసీపీ ఇప్పటికే 148 స్థానాల్లో విజయం సాధించి మరో 3 సీట్లలో ఆధిపత్యాన్ని చూపుతోంది. ఇక తెలుగుదేశం 20 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతూ 3 చోట్ల విజయం సాధించింది.  
మంగళగిరి నుంచి పోటీ చేసిన మంత్రి నారా లోకేశ్ పరాజయం పాలయ్యారు. ఈ ఫలితాలతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సందడి మాయమైంది. అంతా డీలాపడి కనిపిస్తున్నారు. ఇక జనసేన పార్టీ గల్లంతయ్యింది. పవన్ కల్యాణ్ సైతం గెలిచే స్థితిలో కనబడటం లేదు. మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకపక్షంగా అధికారాన్ని వైసీపికి కట్టబెట్టేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాడు ఎన్టీఆర్ - నేడు జగన్: తెదేపా నేతలకు దిమ్మతిరిగే షాక్