Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేంద్రంలో చక్రం తిప్పనున్న కేసీఆర్.. ఆ పథకాలే కారణమా?

కేంద్రంలో చక్రం తిప్పనున్న కేసీఆర్.. ఆ పథకాలే కారణమా?
, గురువారం, 23 మే 2019 (08:10 IST)
అవును.. తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పనున్నారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ సర్కారు చేపట్టిన పథకాల ద్వారా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ నాయకత్వం ఎంతగానో కృషి చేసింది. రైతులకు సైతం 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన క్రెడిట్ కేసీఆర్ సొంతం చేసుకున్నారు. 
 
వేగంగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని భావించిన కేసీఆర్ లక్ష్యం వేగంగా నెరవేరుతోంది. ఇందుకు నిధుల కొరత రాకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇలా తెలంగాణలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న కేసీఆర్... కేంద్రంలోనూ రాణిస్తారని.. ఏమాత్రం అవకాశం లభించినా.. జాతీయ రాజకీయాల్లోనూ తన సత్తా చాటుకుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇక టీఆర్ఎస్ వ్యూహాల్లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలకమనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాను అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు తిరుగులేని వ్యూహాలను రచించడంలో కేసీఆర్ ఎప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ముందుంటారు. టీఆర్ఎస్‌లో కేసీఆర్ వ్యూహాలను పక్కాగా అమలు చేసేందుకు కేటీఆర్, హరీశ్ రావు వంటి డైనమిక్ లీడర్లు ఉన్నారు. ఐటీ మంత్రిగా కేటీఆర్.. బలమైన నాయకుడిగా హరీశ్ రావులు ప్రజల ఆదరణ పొందారు. వీరిద్దరికీ తెలంగాణ రాష్ట్ర పగ్గాలు అప్పగించి కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో దృష్టి పెడతారని సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నువ్వా? నేనా? చంద్రబాబు వర్సెస్ జగన్... AP Assembly 2019 Live results