Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం... ప్రచారం బంద్.. ఐఏఎస్ బదిలీ

Webdunia
గురువారం, 16 మే 2019 (12:14 IST)
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నిర్ణీత గడువు కంటే ఒక రోజు ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని నిషేధించింది. దీంతో చివరి దశ ఎన్నికల పోలింగ్‌ ప్రచారం గురువారం రాత్రి 10 గంటలతోనే ముగియనుంది. వాస్తవానికి ఈ దశ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగియాల్సివుంది. 
 
రెండు రోజుల క్రితం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేపట్టిన రోడ్ షో సందర్భంగా బీజేపీ - టీఎంసీ కార్యకర్తలు ఘర్షణకు దిగిన విషయం తెల్సిందే. దీంతో ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీటిని ఈసీ తీవ్రంగా పరిగణించి ఒక రోజు ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసింది. 
 
అంతేకాకుండా, ప్రభుత్వ అధికారులపై కొరడా ఝుళిపించింది. ఓవైపు అధికార తృణమూల్, బీజేపీల మధ్య వీధి పోరాటాలు తీవ్రరూపు దాల్చిన నేపథ్యంలో పలువురు ఉన్నతాధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. సీఐడీ ఏడీజీ రాజీవ్ కుమార్‌ను కేంద్రానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఆయన వెంటనే ఢిల్లీలోని హోంశాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఎంతో కీలకమైన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ భట్టాచార్యపైనా వేటు పడింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుని సీఈవోకు లేఖ రాయడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments