Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒంటిరిగానే బీజేపీ ప్రభుత్వం : మురళీధర రావు

Advertiesment
ఒంటిరిగానే బీజేపీ ప్రభుత్వం : మురళీధర రావు
, శుక్రవారం, 10 మే 2019 (14:43 IST)
మే 23వ తేదీన వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు జోస్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఓవైపు విపక్షాలన్నీ జట్టు కట్టినా.. ఈసారి కూడా తాము అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
 
2014లో 272 స్థానాలను పొంది కేంద్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు ఎవరూ విశ్వసించలేదు.. కానీ, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. 2019లో కూడా 282 స్థానాలలో బీజేపీ సొంతంగా గెలుపొందబోతోందన్నారు. 
 
ఢిల్లీలో మోడీ ఉండాలనే బలమైన కోరిక ప్రజల్లో ఉంది అన్నారు. ఒక్కో విడత ఎన్నికకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల అంతకంతకూ ప్రజలలో ఆదరణ పెరుగుతూ వచ్చిందన్నారు. తాను ఇంఛార్జ్‌గా పనిచేసిన రాజస్థాన్‌లో కూడా గతంలోలాగానే మొత్తం స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు. దేశ సరిహద్దు ప్రాంతాలలోని ప్రజలు, సరిహద్దు దేశం పట్ల ప్రధాని మోడీ వ్యవహరించిన తీరును గట్టిగా సమర్థిస్తున్నారు. ఇది మా విజయానికి లాభించే అంశమన్నారు. 
 
ఇక ఏపీలో మా పార్టీకి నష్టం చేసిన టీడీపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం అసాధ్యమన్నారు. తెలుగుదేశం పార్టీ మమ్మల్ని వీడిపోయినందువల్ల ఏపీలో బీజేపీకి జరిగిన నష్టాన్ని తమిళనాడులో భర్తీ చేసుకోబోతున్నామనే నమ్మకం ఉందని, తమిళనాడు తమ కూటమి విజయభేరీ మోగించనుందని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడేళ్ల తర్వాత ఇంటికొచ్చిన భర్త... బెడ్ పై భార్యతో నిద్రిస్తున్న మరో యువకుడు...