దానం చేయని వాని సంపద...?

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (10:28 IST)
దానము సేయ గోరిన వదాన్యున కీయగ శక్తి లేనిచో
నైన బరోపకారమునకై యొక దిక్కున దెచ్చియైన నీ
బూనును మేఘ డంబుధికి బోయి జలంబుల దెచ్చియీయడే
వాన సమస్తజీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా...
 
దానము చేయదలచిన ధర్మాత్ముడు తనకు శక్తిలేకపోయినను వెరొకరి వద్దనైనను దెచ్చి యిచ్చును. మేఘము సముద్రమునకు బోయి నీరు తెచ్చి వాన రూపమున అందరు జనులకు యిచ్చుచున్నది గదా..
 
దానము చేయనేరని యధార్మికు సంపద యుండి యుండియన్
దానె పలాయనంబగుట తథ్యము బూరుగుమాను గాచినన్
దాని ఫలంబు లూరక వృధా పడిపోవవె యెండి గాలిచే
గానలలోన నేమిటికి గాక యభోజ్యము లౌట భాస్కరా..
 
బూరుగుచెట్టు బాగుగా ఫలించినను దాని ఫలములు తినరానివగుటచే అవి అడవిలో ఎవరికి ఉపయోగపడక ఎండిపోయి, గాలికి నేలరాలిపోవును. అట్లే ఒకరికి దానము చేయని వాని సంపద యొకప్పుడున్నను మరి యొకప్పుడు తొలగిపోవును.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుమార్తెకు జ్ఞానబోధ చేయడంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ విఫలమయ్యారు : టీఎంసీ ఎంపీ

Hyderabad: హైదరాబాద్‌లో 40 డిగ్రీల మార్కును దాటిన ఉష్ణోగ్రతలు

APSDMA: ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు.. 46 మండలాల్లో తీవ్రమైన వడగాలులు

టీడీపీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్

లిఫ్ట్ వచ్చిందని లోపల అడుగుపెట్టాడు, 3 అంతస్తుల నుంచి కింద పడి స్పాట్ డెడ్, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Rajasekhar: చిరంజీవి తో నటిస్తా - రాజకీయాలంటే నో - యాక్సిడెంట్ అయ్యాకే సక్సెస్ : డా. రాజశేఖర్‌

Peddi Update: రామ్ చరణ్ చిత్రం పెద్ది పై రెండు తాజా అప్ డేట్స్ ?

Samantha: రుద్ర కాల ప్రేక్షకుల మనసు దోచుకోవాలి : సమంత

Kiran: తిమ్మరాజుపల్లి టీవీ ఎక్కడా బోర్ కొట్టదు. బెంచ్ మార్క్ అవుతుంది - కిరణ్ అబ్బవరం

MS Raju: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో డివైన్ థ్రిల్లర్ గా అగధ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments