చదువది యెంత గల్గిన...?

బుధవారం, 23 జనవరి 2019 (12:16 IST)
చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న యా
చదువు నిరర్థకంబు గుణసంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటం
బదనుగ మంచికూర నలపాకము చేసిన నైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా..
 
కూరలో వేయవలసిన పదార్థాలన్నియివేసి బాగా వండినను అందు ఉప్పుమాత్రం వేయనిచో అది రుచిగా ఉండదు. అట్లే సమస్త విద్యలను అభ్యసించిన మానవుడు కూడ ఆ గ్రంథములోని సారము గ్రహింపలేనిచో వానిని సజ్జనులెవ్వరును మెచ్చరు. అప్పుడు వాని చదువు నిరర్థకముగా తలచబడును.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆలు వేపుడు చేసేటప్పుడు నిమ్మచెక్కను వేసి?