వారి మొండితనాన్ని తగ్గించడం ఎలా..?

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (12:37 IST)
చాలామంది చిన్నారులు మెుండిగా ఉంటారు. ఎప్పుడూ వారు చెప్పిందే చేయాలని చెప్తుంటారు. ఒకవేళ అలాకాదని చెప్తే మాత్రం కోపానికి గురై మొండిగా ప్రవర్తిస్తుంటారు. మీ ఇంట్లోనూ పిల్లలు ఇలా ఉన్నారా.. అయితే వారిని దారిలోకి తేవడానికి ఈ కింది జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది..
 
పిల్లలతో ఏ పనినైనా బలవంతంగా మాన్పించాలన్నా, చేయించాలనుకున్నా వ్యతిరేకిస్తే వారు మరింత మొండిగా తయారవుతారు. ముఖ్యంగా ఎదురుదాడి చేస్తారు. అలాకాకుండా ఉండాలంటే.. ముందు పిల్లలతో మమేకమవ్వండి. పని విషయంలో వారి ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలి. మీరు కోరుకున్న మార్పు వచ్చేవరకూ వారికి తోడుగా ఉండాలి. అలానే చిన్నారులకు కావలసిన సలహాలు, సూచనలు ఇస్తుండాలి. అప్పుడే వారు మొండితనం నుండి విముక్తులవుతారు. 
 
పిల్లలు వయసులో చిన్నవారేనైనా వారికి కూడా సొంత ఆలోచనలు ఉంటాయి. తల్లిదండ్రులు.. ప్రతి పనీ ఇలా చేయి అలా చేయి అని వారితో చెప్పడం వలన వారు అలాంటి అంశాలపై అయిష్టత పెంచుకుంటారు. ఆ పనులు చేయకుండా ఉండాలనే ఆలోచన వారిలో ఎక్కువైపోతుంది. ఒక్కోసారి వారికి నచ్చినట్లు చేస్తారు. ఇలాంటి అలవాట్లను వారినలో మాన్నించాలంటే.. ప్రతి పనికి కొన్ని ప్రత్యామ్నాయాలు చూపించాలి. అప్పుడే వారు దానిలో ఒకటి ఎంచుకుంటారు. మీ మాట వింటారు. 
 
మొండిగా ఉండే చిన్నారులను మీ దారిలోకి తేవాలంటే.. ముందువారి వాదన వినడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి. పిల్లలు ఏదైనా విషయంపై అదేపనిగా వాదిస్తుంటే.. మీరు వెంటనే ఖండించొద్దు. ఎందుకంటే.. దానిపై కచ్చితంగా వారికో బలమైన అభిప్రాయం ఉండి ఉండొచ్చు. కనుక ముందు అదేంటో తెలుసుకోవాలి. ఆ తరువాతే మీ అభిప్రాయం చెప్పడమో, వారితో ఏకీభవించడమో చేయొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పార్లమెంట్ సాక్షిగా అమరావతి రాజధానిగా వద్దనే వద్దు : వైకాపా

నవ్యాంధ్ర రాజధానిపై జగన్ కొత్త పల్లవి - మచిలీపట్నం టు గుంటూరును క్యాపిటల్ ఏరియాగా చేయండి..

పెద్దమ్మ కొడుకుతో ప్రేమాయణం, పెళ్లి వద్దన్నందుకు యువతి ఆత్మహత్య

పార్లమెంటులో చారిత్రక ఘట్టం.. లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత బిల్లు

రేపు నిశ్చితార్థం.. ఇంతలో ఘోర ప్రమాదం.. షాకింగ్ వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Vishnu: ప్రజాప్రతినిధులూ డ్రెగ్ టెస్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నా : మంచు విష్ణు

కార్మేని సెల్వం హృదయానికి హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా 'ధురంధర్ : ది రివెంజ్'

యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ 4 రోజుల్లో 3.73 కోట్ల రూపాయల వసూళ్లు

Satya: జెట్లీ ఫస్ట్ సింగిల్ సత్య ఈజ్ నాట్ జెట్లీ ఏప్రిల్ 2న రిలీజ్

తర్వాతి కథనం
Show comments