టమోటా హల్వా..?

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (11:53 IST)
కావలసిన పదార్థాలు:
టమోటాలు - 10
చక్కెర - 1 కప్పు
నెయ్యి - అరకప్పు
బొంబాయి రవ్వ - 1 కప్పు
జీడిపప్పు, బాదం పప్పులు - 2 స్పూన్స్
యాలకుల పొడి - అరస్పూన్.
 
తయారీ విధానం:
ముందుగా టమోటాలను నీళ్ళల్లో ఉడికించి చల్లార్చాలి. ఆపై వాటి గుజ్జును తీసి బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి జీడిపప్పు, బాదం పప్పు, బొంబాయి రవ్వలను విడివిడిగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద కాస్త లోతుగా ఉన్న పాత్రని పెట్టి అందులో 2 కప్పుల నీరు పోసి మరిగించి ఆపై బొంబాయి రవ్వ వేసి కలుపుతూ ఉండాలి. రవ్వ చిక్కబడుతున్న సమయంలో టమోటా గుజ్జు, చక్కెర, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత బాదం పప్పు, జీడిపప్పు కూడా వేయాలి. మిశ్రమం హల్వాలా చిక్కబడుతున్న సమయంలో యాలకుల పొడి చల్లి దించేయాలి. తరువాత ప్లేట్ అడుగుకు కొద్దిగా నెయ్యి రాసి హల్వాని ప్లేటులో వేసి నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే టమోటా హల్వా రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బక్రీద్ పండుగ.. డిజిటల్ చెల్లింపుల ముసుగులో మోసం జాగ్రత్త.. సజ్జనార్

ఔటర్ రింగ్ రోడ్డుపై తగలబడిన ఎయిరిండియా బస్సు

మీనాక్షి అమ్మవారి ఆలయ కార్ పార్కింగ్‌ వద్ద 17ఏళ్ల బాలుడి హత్య

శుద్ధి చేసిన యురేనియంను మాకు ఇస్తారా లేదా నాశనం చేస్తారా? ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Ebola : ఆఫ్రికాలో ఎబోలా-విజయవాడ ఎయిర్‌పోర్టులో పరీక్షా కేంద్రం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments