మధుమేహానికి దివ్యౌషధంగా పని చేసే ఆవాలు

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (11:41 IST)
ఈ రోజుల్లో మధుమేహంతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం లేదు. అయితే కొన్ని ఆహార నియమాలను పాటించడం ద్వారా దానిని నియంత్రించవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ అనేది ఇన్సులిన్ వైఫల్యం వల్ల వస్తుంది. పాంక్రియాటిక్ గ్రంధిలో తయారయ్యే ఈ హార్మోన్ రక్తంలోని షుగర్‌ను నియంత్రిస్తుంది. 
 
ఈ వ్యాధికి ఆవాలు దివ్యాఔషధంగా పని చేస్తాయి. రోజువారీ ఆహారంలో ఆవాలు చేర్చుకుంటే తప్పక ఫలితం ఉంటుంది. ఆవాలు మనకు చేసే మేలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కప్పు ఆవాలను పొడిచేసుకుని అందులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే ఈ పొడిలో కొద్దిగా నూనె కలిపి ఇడ్లీ, దోసవంటి వాటికి సైడ్‌డిష్‌గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
ఆవాలను బాగా ఎండబెట్టి నూనెలో వేయించుకుని అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా వేయించుకుని తీసుకుంటే మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. ఆవాల పొడిని రోజుకు మూడు పూటలా స్పూన్ మోతాదులో తీసుకుంటే రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఆవాలలోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో దోహదపడతాయి. 
 
శరీరానికి అవసరమైన పోషక విలువలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆవాలను నెయ్యిలో వేయించి అందులో కొద్దిగా ఉప్పు, కరివేపాకు చేర్చి పొడి చేసుకోవాలి. తయారుచేసిన ఈ మిశ్రమాన్ని రోజు అన్నంలో కలిపి సేవిస్తే వ్యాధి తగ్గుముఖం పడుతుంది. కప్పు పెరుగులో కొద్దిగా ఆవాల పొడి, ఉప్పు, కొత్తిమిర వేసి తింటే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. తరచుగా ఆవాలతో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలైన తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments