Publish Date: Thu, 04 Apr 2019 (15:46 IST)
Updated Date: Thu, 04 Apr 2019 (15:48 IST)
సరైన సమయంలో తినకపోవడం. కారంగా ఉన్న వస్తువులను అధికంగా తినడం వంటివి అల్సర్‌కు కారణమవుతాయి. ఇది వస్తే కడుపులో మంట పెరుగుతుంది. అసిడిటీని కలిగించే పదార్థాలకు దూరంగా ఉండవలసి వస్తుంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఏమి తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరినీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరిబోండాం అల్సర్‌ను దూరం చేస్తుంది. కొబ్బరిబోండాంలోని నీటిని ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. అందువల్ల శరీర ఉష్ణం కూడా తగ్గుతుంది. కంటికి మేలు చేస్తుంది. జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా చూసుకుంటుంది.
అల్సర్ ఉంటే, కడుపులో మంట, ఛాతిలో మంట, వాంతులు వంటి లక్షణాలు తెలియవస్తాయి. ఇలా ఉంటే చాక్లెట్, కూల్ డ్రింక్స్, మద్యపానం, పెప్పర్‌మింట్, కాఫీ, బ్లాక్ టీ, ఆరెంజ్, ద్రాక్ష, వెల్లుల్లి, మిరప, పాల ఉత్పత్తులు, కారపు పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. ఇక మధ్యాహ్నం పూట కొబ్బరిబోండాం నీటిని తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
రక్తహీనతకు చెక్ పెడుతుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. పచ్చకామెర్లు, కలరా, చికెన్ ఫాక్స్‌ను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. గోధుమలు, చికెన్, చేపలు, బీన్స్, కోడిగుడ్డు, పెరుగు, మేడిపండును తీసుకోవచ్చు. కానీ చక్కెర, కొవ్వు అధికంగా గల ఆహారాన్ని పూర్తిగా తీసుకోవడం మానేయాలి. ఉప్పును కూడా తగ్గించాలి.
సందీప్
Publish Date: Thu, 04 Apr 2019 (15:46 IST)
Updated Date: Thu, 04 Apr 2019 (15:48 IST)