భారతదేశ మొబైల్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న చైనాకు చెందిన మొబైల్ తయారీదారు సంస్థ షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది.
ఈ ఫోన్ ఈనెల 29వ తేదీ నుండి అమేజాన్, ఎంఐ హోం స్టోర్స్‌లో రూ. 7,999 ప్రారంభ ధరతో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను పొందుపరచినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.