Webdunia - Bharat's app for daily news and videos

Install App

షోవోమి నుంచి ఆండ్రాయిడ్ ఫోన్.. ఏ సిరీస్ నుంచి చివరి ఫోన్

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (12:25 IST)
Xiaomi Mi A4
షావోమి నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ రానుంది. ఎలాంటి కస్టమైజ్డ్‌ యూఐ లేకుండా ప్యూర్‌ ఆండ్రాయిడ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కావాలనుకునేవారి కోసం షావోమి ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రోగ్రామ్‌ కింద 'ఏ' సిరీస్‌ ఫోన్లను తీసుకొస్తోంది. 
 
ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఎంఐ ఏ1, ఏ2, ఏ3 ఫోన్లు వచ్చాయి. తక్కువ ధరలో నాణ్యమైన ఫోన్లు కావడంతో యువతలో వీటికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. అయితే, ఇకపై ఈ సిరీస్‌లో ఎలాంటి ఎలాంటి ఫోన్లు రావు. ఇటీవలే ఆ కంపెనీ ఈ విషయాన్ని స్పష్టంచేసింది. అంటే ఏ3నే ఈ సిరీస్‌లో చివరి ఫోన్‌ అన్నమాట.
 
ఈ సిరీస్‌లో ఫోన్లను తీసుకురాకపోవడానికి షావోమి ఎలాంటి కారణాన్ని పేర్కొనలేదు. అయితే, ఈ ఫోన్లకు అప్‌డేట్లు అందించడమొక్కటే ఆ కంపెనీ భారంగా భావిస్తోందని సమాచారం. 
 
ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రోగ్రామ్‌ కింద మూడేళ్ల పాటు అప్‌డేట్స్‌ అందించాల్సి ఉంటుంది. అందుకే ఇకపై ఈ ఫోన్లను తీసుకురాకుండా తన ఆండ్రాయిడ్‌ ఫోన్లను కస్టమైజ్‌ చేసి ఎంఐయూఐతోనే తీసుకురావాలని భావిస్తోంది.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments