Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిపోతున్న కేసులు.. 24 గంటల్లో 56వేల మందికి కరోనా

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (10:48 IST)
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో గత పది రోజులుగా 50వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 56 వేలకుపైగా కరోనా కేసులు రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసులు 20 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 56,282 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 19,64,537కు చేరింది. 
 
ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 5,95,501 మంది బాధితులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. మరో 13,28,337 మంది కోలుకున్నారు. తాజాగా కరోనా బారినపడినవారిలో 904 మంది మరణించారు. ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో బాధితులు మరణించడం ఇదే మొదటిసారి. దీంతో కరోనా మృతులు 40,699కు చేరారు. దేశంలో రికవరీ రేటు 67 శాతం దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
దేశంలో ఇప్పటివరకు 6,64,949 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. ఆగస్టు 5న 2,21,49,351 మందికి కరోనా పరీక్షలు చేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments