వచ్చే పదేళ్ళకు ఉపయోగపడేలా విండోస్ 11 ఆవిష్కరణ

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (12:25 IST)
ప్రతి ఒక్క నెటిజన్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న విండోస్ 11 త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ విండోస్ 11 సరికొత్త ఆపరేటింగ్ సిస్టంను వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ గురువారం ఆవిష్కరించింది. 2015లో విండోస్ 10 విడుదలైన తర్వాత మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన మరో ఆవిష్కరణ ఇదే. 
 
విండోస్ 11 ఆవిష్కరణ సందర్భంగా ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. విండోస్ చరిత్రలో దీనిని ఓ మైలురాయిగా అభివర్ణించారు. రానున్న పదేళ్ల వరకు వినియోగదారుల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా దీనిని రూపొందిస్తున్నట్టు చెప్పారు.
 
విండోస్ 11లో స్టార్ట్ మెనూ కొత్తగా ఉంటుందని అన్నారు. టాస్క్ బార్, ఫాంట్, ఐకాన్‌ల విషయంలోనూ సరికొత్త అనుభూతిని అందిస్తుందన్నారు. విండోస్ 11 ఓఎస్ ద్వారా ఆండ్రాయిడ్ యాప్‌లను కూడా వినియోగించుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తుందన్నారు. 
 
ఈ ఏడాది చివరినాటికి కొత్త కంప్యూటర్లతోపాటు విండోస్ 10 వినియోగదారులకు కూడా ఈ సరికొత్త ఓఎస్ ఉచితంగా అందుబాటులోకి వస్తుందని సత్య నాదెళ్ల తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్‌ ఫోన్లు, ఇతర స్మార్ట్ పరికరాలు ప్రజాదరణ పొందడంతో విండోస్.. ఆపిల్, గూగుల్ నుంచి గట్టి పోటీని మైక్రోసాఫ్ట్ ఎదుర్కొంటోందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ కొత్త సినిమాకు విజయం టైటిల్ ఖరారు

అవి ఐటమ్ సాంగ్‌లు కాదు... ప్రత్యేక డ్యాన్స్ నంబర్లే : తమన్నా

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

తర్వాతి కథనం
Show comments