Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాష్‌బ్యాక్‌... అదిరిపోయే ఆఫర్.. వాట్సాప్ అదుర్స్

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (18:28 IST)
ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవలే మన దేశంలో యూపీఐ ఆధారిత పేమెంట్స్‌ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు క్యాష్‌బ్యాక్‌ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.
 
గతంలో గూగుల్ పే, ఫోన్ పే అనుసరించిన మార్గానే ఇప్పుడు వాట్సాప్ కూడా అనుసరిస్తోంది. క్యాష్‌బ్యాక్‌లతో వినియోగదారులను మరింతగా ఆకర్షిస్తోంది. వాట్సాప్‌ చెల్లింపు సేవ నవంబర్ 2020 నుండి భారతదేశంలో అమలులోకి వచ్చింది. 
 
ఇది యూపీఐలో మాత్రమే పని చేస్తుంది. వాట్సాప్‌ పేని సెటప్ చేసిన తర్వాత, మీరు చెల్లింపు సేవ ప్రయోజనాన్ని పొందవచ్చు. వాట్సాప్‌ ద్వారా చెల్లింపులు చేస్తే కస్టమర్లు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
 
ఆండ్రాయిడ్‌లో వాట్సాప్‌ బీటా వినియోగదారులకు 'గివ్‌ క్యాష్‌, గెట్‌ రూ.51' పేరుతో బ్యానర్‌ కనిపిస్తుంది. వారు నచ్చిన ఐదుగురికి యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తే వెంటనే వారికి రూ.51 క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. 
 
ఇంత మొత్తం పంపాలన్న నిబంధనలేమి లేవు. 1 రూపాయి కూడా పంపినా రూ.51 క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. పేమెంట్‌ పూర్తయిన కొద్దిసేపటికే ఈ క్యాష్‌బ్యాక్‌ మొత్తం అకౌంట్‌లో జమ అవుతుంది. అయితే, క్యాష్‌బ్యాక్‌ సదుపాయం గరిష్ఠంగా ఐదుగురికి పంపడానికే వర్తిస్తుంది.
 
ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు ఈ ఆఫర్‌ అందిస్తోంది. త్వరలో అందరికీ ఈ క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. పేమెంట్‌ సేవలను ప్రారంభించిన తొలి రోజుల్లో గూగుల్‌ పే కూడా స్క్రాచ్‌ కార్డుల రూపంలో క్యాష్‌బ్యాక్‌ అందించి పెద్ద సంఖ్యలో వినియోగదారులను సొంతం చేసుకుంది. పేటీఎం, ఫోన్‌ పే సైతం ఇదే దారిలో వెళ్తున్నాయి. ఇప్పుడు వాట్సాప్‌ సైతం అదే తరహాలో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
 
పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే ఇండియాలో ఎక్కువ వాడుతున్నారు. భారత్‌లో యూపీఐ ఆధారిత నగదు బదిలీ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. ఇప్పుడు వాట్సాప్ కూడా అదే తరహాలో నడుస్తోంది. క్యాష్‌బ్యాక్ కోసం, వాట్సాప్‌, గూగుల్‌ పే వంటి కార్డులను కూడా పరిచయం చేసింది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments